తెలంగాణ సాయుధ పోరాటాన్ని విభిన్నమైన దృక్కోణంలో విశ్లేషించే పరిశోధనాత్మక రచన ... తిరగబడ్డ తెలంగాణ. భూస్వాముల, దొరల, నిజాం పాలకుల దోపిడీకి గురయిన సాధారణ ప్రజలు ఆ అణచివేతను ఎంతో కాలం సహించలేకపోయారు. బాంచెన్‌, కాల్మొక్త అని పడున్నవారే ఆ అసమానతలపై తిరగబడ్డారు. ఆ పీడిత ప్రజల చైతన్యాన్ని ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమక్రమానికి ఉపయోగించుకున్నాయి. కులాలు, వర్గాలు, వృత్తుల వారీగా ప్రజల చైతన్యక్రమాన్ని పేర్కొంటూ, అట్టడుగు వర్గాల పోరాట తీరును ఇందులో విశ్లేషించారు రచయిత. అగెనెస్ట్‌ దొర అండ్‌ నిజాం, పీపుల్స్‌ మూమెంట్‌ ఇన్‌ తెలంగాణ పేరుతో ఇనుకొండ తిరుమలి రాసిన పుస్తకానికి తెలుగు అనువాదమిది.
- వెంకట్‌ (ఈనాడు ఆదివారం 3 ఆగస్ట్‌ 2008)
తెలంగాణా ప్రజా పోరాటంపై వచ్చిన నవలలు, కమ్యూనిస్టుల రాతలు కొంత పాక్షిక దృష్టితో,అతిశయోక్తులతో వచ్చాయని తెలిపిన రచయిత - చారిత్రక దృష్టితో, తగిన ఆధారాలో రూపొందించిన ఈ పరిశోధనా గ్రంథాన్ని ప్రామాణికంగా తీర్చిదిద్దడంలో చేసిన కృషిని అభినందించకుండా వుండలేం.
- కె.పి అశోక్‌ కుమార్‌ (వార్త దినపత్రిక 1 జూన్‌ 2008)

Write a review

Note: HTML is not translated!
Bad           Good