తన చూపుల్ని డాబా ఇంటివైపు మరల్చాడు శ్యామసుందర్.
చూస్తుండగానే షంషేర్ బాబాను తీసుకుని యస్సై మునీర్ లోపలికెళ్ళాడు. నల్లగా కాలిపోయి గుర్తుపట్టడానికి వీల్లేనంత బీభత్సంగా బెడ్ మీద పడుంది అన్వర్ శవం. ంచె దగ్గర్నుంచి పోలీసులు ఆ శవాన్ని తెచ్చి బెడ్ మీద వుంచారు. ఎంతోకాలంగా తనకు నమ్మకంగా సేవలందించిన అన్వర్ని ఆ స్థితిలో చూడలేకపోయాడు షంషేర్ బాబా. శవం పక్కన కూలబడిపోయి కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
మునీర్ పదిసెకన్లు అతని వెనక మౌనంగా నిలబడ్డాడు. నిశ్శబ్దంగా తలదిండు అందుకుని, తన రివాల్వర్కి సౌండ్ రాకుండా అడ్డం వేసి వెనక నుంచి పాయింట్ రేంజిలో షూట్ చేసాడు.
షంషేర్బాబు ఊహకందని సంఘటన అది. వీపు భాగంలోంచి గుండెల్లోకి సూటిగా దూసుకుపోయింది బుల్లెట్. అరవాలని నోరు తెరిచాడు. కాని అరుపు గొంతుదాటి బయటకు రాలేదు. తెరచిన నోటిగుండా వెంటనే ఎగిరిపోయాయి ప్రాణాలు. ఎందుకైనా మంచిదని రెండో రౌండ్ కూడా షూట్ చేశాడు.
క్షణాల్లో శవంగా మారిపోయిన షంషేర్ బాబా అలాగే ముందుకు వాలిపోయాడు అన్వర్ శవం మీదకు.
రివాల్వర్ని జేబులోకి తోసాడు యస్సై మునీర్. తను రామ్కిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు తను హీరో. జునాగడ్ని రౌడీల నుంచి విముక్తి చేయటానికి తను మూలస్తంభాన్నే కూలగొట్టి తన కర్తవ్యం నిరూపించుకున్నాడు. ఇక మిగిలింది తను సేఫ్గా అవతలకు పోవటం.
ఈ విషయం తాజుద్దీన్ గాని, మిగిలిన వాళ్ళు గాని పసిగడితే తనను పిట్టను కాల్చినట్లు కాల్చేస్తారు. కనీసం తను కట్టడంలోకి పారిపోయే వరకైనా ఈ విషయం వాళ్ళకు తెలీకుండా మెసేజ్ చేయాలి.
ముఖాన పట్టిన చెమటను తుడుచుకున్నాడు. ఆలస్యం చేస్తే ప్రతిక్షణం తనను చావుకు దగ్గర చేస్తుందని తెలుసు. ఉన్నట్టుండి పెద్ద పెద్ద అంగలతో బయటకు కదిలాడు.
తాజుద్దీన్తోబాటు మిగిలిన వాళ్ళంతా అక్కడ ఆవరణలో నిలబడి జరిగిన దానిని గురించి చర్చించుకుంటున్నారు. అంతలో హడావిడిగా అక్కడకు వచ్చిన యస్సై మునీర్ని చూసి నొసలు ముడివేశాడు తాజుద్దీన్.
గేంగ్వార్ నేపథ్యంతో మధుబాబు అందిస్తున్న మరో థ్రిల్లింగ్ నవల 'టైమ్ బాంబ్'
Rs.110.00
In Stock
-
+