మహమ్మదాలీ నిన్ను బంధించటానికి కారణం శాటిలైట్‌ గమనించిన గోల్డ్‌మైన్‌ కాదు. బెహ్రూ పర్వత శిఖరానికి దగ్గర్లో ఒక పెద్ద క్షిపణి బేస్‌ని నిర్మించేపనిని మొదలుపెట్టాడతను. శాటిలైట్‌లోని కెమేరా ఆ బేస్‌ని కనిపెట్టి ఫోటోలు తీసింది. ఆ గుట్టు రట్టు అవకుండా అతను  చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. క్షిపణుల బేస్‌ని కనిపెట్టి మనం దొంగదెబ్బలకు గురికాకుండా కాపాడినందుకు మన సైన్యాధికారులు నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు'' మొదటి పేజీలోని మేటర్‌ అది.
రెండో పేజీలో గోల్డ్‌మైన్‌ని గురించి వివరించారు స్పెషల్‌ బ్రాంచి అధికారులు.
''నువ్వు కనిపెట్టిన ప్రదేశంలో ఏదో కొంచెం స్వచ్ఛమైన బంగారం లభిస్తుందని ఇంజనీర్‌ సంపత్‌ అభిప్రాయపడుతున్నాడు. మన శాటిలైట్‌ కనిపెట్టిన బంగారం మన దురదృష్టం కొద్దీ మన భూభాగంలో లేదు. కొండవాగుకు ఆవల, తుఫ్రానీ గుట్టల్లో ఉన్నాయి ఆ గనులు. ఆ విషయం తెలియక అవి మనదేశంలో ఉంటే దొంగచాటుగా స్వాధీనం చేసుకోవచ్చని భావించి అనవసరమైన శ్రమకు గురయ్యాడు అరిఫ్‌ఖాన్‌. మన శాటిలైట్‌ అందించిన ఇన్‌ఫర్మేషన్‌ని ఆ ప్రభుత్వానికి తెలియజేసే ఏర్పాటు చేస్తోంది మన విదేశాంగశాఖ. బహుశా ఆ ప్రభుత్వం నుంచి కూడా మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మెసేజ్‌ రావచ్చు''.
తాము కోరిన వెంటనే ప్రాణాలకు తెగించి అప్పచెప్పిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసిన వాత్సవను టైగర్‌ వాత్సవగా చిత్రిస్తూ మరోసారి కృతజ్ఞతలు తెలియచేసుకుని లేఖ ముగించారు స్పెషల్‌ బ్రాంచి అధికారులు.
డైనమిక్‌ సిటీ సెక్యూరిటీ సర్వీసెస్‌లో భాగస్థుడైన వాత్సవ తన విధి నిర్వహణలో టైగర్‌ వాత్సవగా పేరు తెచ్చుకున్న వైనాన్ని వివరించారు మధుబాబు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good