సాహసంతో కూడిన కథనం

కుల వ్యవస్థ పునాదులపై నిర్మితమైన మన సమాజంలో ఎంత ఆధునికత వచ్చినా, శాస్త్ర విజ్ఞానం మరెంతగా పెరిగినా, ఆ అసమానతలు నేటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. చుండూరు ఘటన, తీర్పు నేపథ్యంలో విద్యావంతుడైన, పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న పి.వి.సునీల్‌ కుమార్‌ కలం నుంచి వెలువడిన అక్షరాగ్నులే ఈ కథ. ఒక ఘటనకు అగ్రకుల, అట్టడుగువర్గాల హృదయాంతరంగాల వాణిగా ఈ కథను చెప్పారు. ఇది సాహసంతో కూడిన కథనం, తెలుగు కథా సాహిత్యంలో ఓ వినూత్న ప్రక్రియగా చెప్పాలి.

- ముత్యాల ప్రసాద్‌

   ఎడిటర్‌, విశాలాంధ్ర

పాఠకుల స్పందన

ఈ కథ ఉద్యమ స్ఫూర్తినిస్తుంది

'థూ...' కథ.. దుర్మార్గమైన కులవ్యవస్థ మీద ఊసిన ఉమ్మిమాత్రమే కాదు, అగ్నిపర్వత విస్ఫోటనం. అనివార్యమైన ఆగ్రహజ్వాల. చుండూరు కేసు తీర్పు నేపథ్యంలో ఈ న్యాయవ్యవస్థ మీద, కుల వ్యవస్థ మీద ప్రతి ఒక్కరూ ఉమ్మాల్సిందే. సామాజిక న్యాయం, చట్టబద్దపాలన కోరుకునే ప్రజాస్వామ్య పౌరులు సాగించే పోరాటానికి ఈ కథ ఉద్యమస్ఫూర్తినిస్తుంది. కులవ్యతిరేక పోరాటానికిగల తాత్వికతను అత్యంత సమర్థవంతంగా రచయిత ఈ కథలో ప్రతిబింబించారు. తానంటూ సొంతంగా ఏమీ చెప్పకుండా రెండు పాత్రలతో ఈ కుల వైరుధ్యాలలోని, సంఘర్షణలోని పార్శ్వాలను చెప్పించడం కథా కథనంలోని నైపుణ్యాన్ని వెల్లడిస్తుంది. ఒక అత్యున్నత పోలీసు అధికారి హోదాలో ఉండికూడా సునీల్‌కుమార్‌ స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించగలగడం సంతోషించదగ్గ విషయం.

- డి.సోమసుందర్‌

       అధ్యక్షులు, ఏపీయూడబ్ల్యూజె

Pages : 14

Write a review

Note: HTML is not translated!
Bad           Good