బెంగాలీ, రష్యన్‌ భాషల్లోకి అనువాదమైన తెలుగు నవల!

ఆంధ్రా యూనివర్షిటీ విద్యార్థి జీవితానికి నిలువుటద్దం !! ''తొలి మలుపు''

తొలి మలుపు : రాత్రి పదిన్నర గంటలకిగాని బయలుదేరదు బెజవాడ హౌరా జనతా! అయినా ఎనిమిది గంటలకే ప్లాట్‌ఫారం మీద పెట్టివున్న రైలు పెట్టెలన్నీ కిక్కిరిసిపోయేయి!

జూన్‌ నెల అన్నీ కాలేజీలు తెరుస్తారు. యూనివర్షిటీ తెరుస్తారు. వేసవికాలానికీ, శలవులకీ స్వస్తిచెప్పి విద్యార్థులంతా యిళ్ళు వదలి చదువులకోసం దూరబారం వెళుతున్నారు!

రాజశేఖరం తండ్రి వెనకాతల యజమాని వెంట కొత్తజాగాలో ప్రవేశించే లేగదూడలాగా నడుస్తున్నాడు! రెండో నెంబరు ప్లాట్‌ ఫారమంతా కోలాహలంతో సాయంకాలం ఆరుగంటలవేళ పార్కులో వటవృక్షం మీదకి చేరుకుని గోలచేసే కాకిగోల లాంటి అల్లర్లతో నిండిపోయింది!

''హలో!''

''ఏవండోయ్‌?''

''ఓహో! మీరు కదూ!''

''మీరు! యీ ట్రయినులో నేనా?''

''ఔనండీ! నిన్న చవితి అంటేను ఇవాళ బయలుదేరేను!''

''అయితే మీకూ వున్నాయన్నమాట యీ చాదస్తాలు!''

ఇలాగ అనేకరకాలుగా పలకరించుకుంటూ, రకరకాల దుస్తులు కట్టుకుని బోలెడుమంది యువకులు సందడి యినుమడింప జేస్తునా&్నరు. హడావుడిగా ఇటూ అటూ తిరుగుతున్నారు......

పేజీలు : 126

Write a review

Note: HTML is not translated!
Bad           Good