ఇదొక పార్శ్వంలో చూస్తే చారిత్రక నవల. రూడార్థంలో కాదు. కొన్ని శతాబ్దాలకిందటి చరిత్ర కాదిది. సమకాలీన చరిత్ర. ఇటీవల చరిత్ర పరిశోధనల్లో సమకాలీనత బలంగా చోటుచేసుకొంది. దీనికొక ప్రాముక్యతవుంది. ఈ చరిత్రకు ఆనవాళ్ళు ప్రత్యేకించి దస్తావేజుల్లో, కైఫీయతుల్లో దొరకవు. వ్యక్తులు రాసుకొన్న డైరీలు, ఉత్తరాలు, మౌఖిక సాక్ష్యాలే కాకుండా, కల్పనా సాహిత్యం - కథలు, నవలలు మరీ ముఖ్యంగా స్వీయానుభవం, గత కాలపు స్మృతులు - ఈ కోవకు చెందిందే యీ నవల. కోస్తాంధ్ర ప్రాంతం, విశాలభారతదేశంలో అంతర్భాగంగా, లోనవుతున్న ఆర్థిక, సామాజిక, కొంత మేరకు సాంస్కృతిక వికాసానికి అద్దం పడుతుంది. నవలకున్న ప్రాముఖ్యత అదే గాక ప్రాసంగికత కూడా. - వకుళాభరణం రామకృష్ణ

చదువంటే పరీక్షలు కాదు - బట్టీలు పట్టడం కాదు. మార్కులూ ర్యాంకులూ కాదు - ఒక ఆటా పాటా లేకుండా, ఉదయం నుండి రాత్రి పదింటి దాకా చదువు తప్ప మరో లోకం లేకుండా ఉండటం గాదు - ''చదువంటే జీవించటం నేర్పాలి - జీవితాన్ని ప్రేమించడం నేర్పాలి. బతుకును భారం గాకుండా తియ్యగా బతకడమెట్లాగో నేర్పాలి'' అని కూడా బోధిస్తుంది, విడమరుస్తుంది, ముందుకు నడిపిస్తుంది ఈ 'తొలి అడుగులు'. ఒక అపురూప అదృశ్య ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది ఈ నవల. మన బాల్యాన్ని తట్టి లేపుతుంది ఈ నవల! మన పిల్లల బాల్యాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో కూడా నేర్పుతుంది ఈ నవల! ఏమీ సంబంధం లేకపోయినా గోర్కీ 'నా బాల్యం', నా బాల్యసేవ గ్రంథాలను గుర్తుకు తెస్తుంది ఈ నవల! ఈ నవల చదవటం పాఠకులకు ఒక మధురమైన అనుభవం! ''పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నం కోసం'' మీరూ ఈ నవల చదవండి! - సింగమనేని నారాయణ

పేజీలు : 239

Write a review

Note: HTML is not translated!
Bad           Good