(సేద్యం పై ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి దీర్ఘకావ్యం ''పొలి'' ఆంగ్లానువాదం)
....యిదొక స్వానుభవ కావ్యం. అందుకే ఎక్కడా జారుడుతనం గానీ, లూజ్‌గా వుండటం గానీ జరగలా - వ్యవసాయ సంబంధిత దృశ్యాలు అలా అలా కళ్ళముందు రుతుక్రమంలో ఎంతో అందంగా కదిలిపోతాయి .... కవి అంతగా లీనమై పలికారు. తన అనుభవం నుంచి.... ఆయన పలకటం వల్ల ఈ కావ్యానికి ఒక కవిత్వసాంద్రత వచ్చింది. ఒక రకంగా యిదొక స్మృతికావ్యం- ఒక వ్యవసాయపు ఎలిజి. గత స్మరణే కాకుండా, వర్తమానపు దుస్థితిని పోల్చి ఆయన కల్ళకు కట్టడం వల్ల పాఠకుడు ఈ కావ్యంలో మగ్నం అవుతాడు. తనకు తెలియని, తను చూడని ఒక లోకంలోకి ఒక అద్భుత గ్రామీణ జీవితంలోకి ప్రవేశిస్తాడు, పరవశిస్తాడు.
అనేక ప్రపంచభాషల్లో రాసిన కవిత్వం ఆంగ్లమాధ్యమం ద్వారా మనం చదవటం, ఆనందించటం అనుభవించటం కొత్తేమీగాదు. అలాగే రాచపాళెంగారి 'పొలి' ఆంగ్లానువాదాన్ని తెలుగేతరులు అనుభవిస్తారని, ఆనందిస్తారని - ఒక సామాజిక వాస్తవికతని - నిర్దిష్టమైన సామాజిక వ్యావసాయిక వాస్తవికతని - సాధారణీకరణ పొందటం ద్వారా - ఇలా జనరలైజ్ కావడం ద్వారా అందరూ అనుభవిస్తారని ఒక సత్యాన్ని దర్శిస్తారని ఆశిస్తున్నా. - కె.శివారెడ్డి
Pages : 121