ఈ నవలకు ‘సాహిత్య అకాడెమి’ బహుమతిని ఆర్.కె. నారాయణ్ అందుకున్నారు. ఈ కథలో ప్రధాన పాత్ర రాజు అనే ‘టూరిస్ట్ గైడ్’ ది. అతని బాల్యం అంతా మాల్గుడి సరిహద్దుల్లో తన తండ్రి చిన్న కిరాణా వ్యాపారం చేస్తూ ఆ దారిన పోయే ఎడ్ల బండి వాళ్లకి పుగాకు, పిప్పరమెంట్లు అమ్మే కాలంలో గడుస్తుంది. తండ్రి మరణించే ముందు తన దుకాణం ఎదురుగా నిర్మించిన మాల్గుడి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద రాజుకి చదువు మాన్పించి అతని చేత చిన్న వ్యాపారం ప్రారంభింపజేస్తాడు. అప్పటి నుంచి అతన్ని రైల్వే రాజు అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తరువాత రాజు దృష్టి మాల్గుడి పరిసర ప్రాంతాల్లోని విశేషాలు చూడటానికి వచ్చే యాత్రికులపై పడి వారికి గైడ్‌గా వ్యవహరించే వృత్తిని ఎంచుకుంటాడు. ఆ క్రమంలోనే పర్యాటకులుగా వచ్చిన కథానాయిక ‘రోజీ’. ఆమె భర్త మార్కోతో పరిచయమవుతుంది. రోజీ ఆకర్షణలో పడ్డ రాజు జీవితం అక్కడి నుంచి మలుపు తిరుగుతుంది. తన కథని రాజు తన చివరి రోజుల్లో ‘అక్కడి గ్రామంలో ‘వేలన్’ అనే వ్యక్తికి వివరిస్తాడు. ఆ గ్రామంలో రాజుకి ఇష్టం లేకపోయినా గ్రామీణులు అతన్ని ఒక పుణ్యాత్ముడిగా కొలవడం కథకి ప్రాధాన్యత తెస్తుంది. అక్కడే అతని జీవితం కూడా ముగుస్తుంది.
పేజీలు :