అమెరికాలో స్థిరపడిన ఇటలీ మూలాలకు చెందిన మాఫియా కుటుంబం పెద్ద గాడ్ ఫాదర్. విటో కార్లియోన్ అనే మాఫియా డాన్ అతని చిన్న కొడుకు మైఖేల్ కార్లియోన్ ఆ నవలలోని అతిముఖ్యమైన పాత్రలు, మరో పాతిక ముప్పై ప్రధాన పాత్రలు, ఇంకో వంద పై చిలుకు ప్రాణప్రతిష్ట పొందిన ఇతర పాత్రలు అసాధారణమైన వాస్తవికత.
1969లో రాసిన గాడ్ ఫాదర్ నవల కథాకాలం 1945-55. రెండో ప్రపంచయుద్ధం తర్వాత అమెరికా సాంఘిక, ఆర్థిక, నేర వ్యవస్థలలో వచ్చిన పరిణామాలను అద్దంలో చూపిస్తుంది. ఈ నవల సందర్భానుసారం 1945 కన్నా ముందటి అమెరికాను ముస్సోలినీ నాటి ఇటలీ నీ కూడా చిత్రిస్తుందీ నవల. ఆయా వ్యక్తుల, కుటుంబాల, ప్రదేశాల, దేశాల, సంస్కృతులు పునాదులనూ, నేపధ్యాలనూ పరామర్శిస్తుంది. పరామర్శించి ఊరుకోకుండా లోతులూ అగాధాలలోకి వెళ్ళి క్షుణ్ణంగా వివరిస్తుంది. డాన్ కుటుంబంతోపాటు అతని సమకాలీనులూ పోటీదార్లూ అయిన మరో నాలుగయిదు ఇటలీ మాఫియా కుటుంబాలనూ మనకు పరిచయం చేస్తుంది...!