'అవినీతి వల్లే దేశ ప్రతిష్ఠ మసకబారుతోంది. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న 'పెద్దవాళ్ళను' వదిలేసి చిన్న ఉద్యోగులను పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు'' - ప్రధాని మన్మోహన్‌సింగ్‌
మన సామాజిక, ఆర్ధిక పునాదులు చాలా బలంగా ఉన్నాయి. ఏనుగంతటి ఆ బలాన్ని చిన్న అవినీతి పురుగు పీల్చి పిప్పిచేస్తోంది. ఈ చీడను వెంటనే వదిలించుకోవాలి''. - మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం
''ఈ సమాజాన్ని అవినీతి కేన్సర్‌ కబళిస్తోంది. నాడీమండలం వంటి రాజకీయ వ్యవస్ధని, దాన్ని నడిపిస్తున్న పరిపాలనా విభాగాలని ఇది ఆబగా భక్షిస్తోంది'' - సుప్రీమ్‌ కోర్ట్‌
మనం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా లంచం ఇవ్వకుండా పని జరగని రోజులివి. మన దగ్గర లంచాలని ఆశించే ప్రభుత్యోద్యోగులు వారి కుటుంబ భద్రత కోసం లంచాలని తీసుకుంటున్నారు. కాని వారు ఏంటి - కరప్షన్‌ బ్యూరోకి పట్టుబడితే? అప్పుడు వారి గతి, వారి కుటుంబ సభ్యుల గతి ఏమవచ్చు?
ఈ ఇతివృత్తంలో రాసిన నవల 'ది ఎండ్‌'. రాష్ట్రంలోని అవినీతిని ఇతివృత్తంగా తీసుకుని శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి తన మార్కు సస్పెన్స్‌, సెంటిమెంట్‌, హాస్యాలని మేళవించి రాసిన నవల ది ఎండ్‌. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good