ఈ నాసిరకం మనుష్యులు ఎంతటి ఘోరాన్నయినా భరించగలరు. నికృష్ట పరిస్థితులను చిరకాలం భరించగలరు. ఎదిరించి నిలిచే ధైర్యం జన్యుపరంగా సంక్రమించుకోలేకపోయింది. గనుకనే ఈ దేశం శతాబ్దాల తరబడి పరాయి పాలనలో దాస్యంలో మగ్గిపోయింది.

వెయ్యేళ్ల క్రితమే గజనీ మహ్మద్‌ 17 సార్లు ఈ దేశంపై దండయాత్ర జరిపాడు. ఆ తరువాత ఘోరీ ఏడుసార్తు... పృధ్వీరాజ్‌ చౌహాన్‌ ఒకసారి ఘోరీని ఎదిరించి నిలచినా... స్వదేశీయుల కుట్ర వల్ల రెండోసారి ఓడిపోయాడు. ఘోరీ ప్రతినిధిగా వచ్చిన ఒక బానిస సైనికాధికారి కుతుబుద్దీన్‌ ఐబక్‌ తరువాత సుల్తానుగా పాలించాడు. తరువాత మరెన్నో తప్పులు చేసి ఈ దేశాన్ని మొగలాయిలకు... తరువాత ఆంగ్లేయులకు అప్పగించాము. ఇప్పుడేమి చేస్తున్నాము? సుమారు శతాబ్ధం పోరాటం జరిపి సాధించుకున్న స్వాతంత్య్రానికి షష్ఠిపూర్తి అవుతుండగానే ఇపుడు న్యూక్లియర్‌ డీల్‌... అమెరికా పెత్తనం... ప్రపంచ బ్యాంకు పెడుతున్న ఆంక్షలు... అయిపోతుంది. అయిపోయింది... మహాకవి గురజాడ గిరీశంతో చెప్పించినట్టు ఇండియా డీజెనరేషన్‌కు కారణాలు పదకొండు కాదు... కోటి కారణాలు ఉన్నాయి.

వాటిలో జనం గుర్తించనిది.. ఇప్పటికీ జనానికి అవగాహన లేనిది - జన్యులోపం. తరాలుగా కొనసాగుతున్న జన్యు విధ్వంసం... ఒకే రక్త ఘోష... ఒకే కుల ఘోష., జవం, జీవం, శౌర్యం, మేథ, పట్టుదల గల జన్యువు తరం నుండి తరానికి సంక్రమించకుండా చేసిన మూఢత్వం, కులం, మతం, ప్రాంతం, ఆస్తి కలబోసిన మూఢాచారం.

''గట్టివాడే గెలుస్తాడు' - అని డార్విన్‌ ఏనాడో చెప్పాడు. ఈ జాతి అటువంటి గట్టివారితో నిండిపోవాలి. ఒక ఆశయం కోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయని వాళ్లు, అగ్నిలా చెలరేగేవారు - ఈ సమాజానికి కావాలి....

పేజీలు : 96

Write a review

Note: HTML is not translated!
Bad           Good