థాయిస్‌ ఒక నగర వేశ్య. నలుగురి ముందు కాలికి గజ్జెకట్టి ఆడిరది, పాడిరది. అభినయించింది. లోకంలోకల్లా తానే అందకత్తెనన్నట్లు అహంకారంతో ఎవరినీ లక్ష్యపెట్టకుండా జీవించింది. ఆటతో, పాటతో అందరినీ మైమరపించింది. సాటిలేని అభినేత్రిగా పేరు వహించింది. పాపపంకిలంలో పడి కొట్టుకున్నది.

పప్నూటియస్‌ ఒక గొప్ప వేదాంతి. పరివ్రాజకుడు. సర్వం త్యజించి తపోవనాలలో ఉంటున్న పుణ్యాత్ముడు. క్రైస్తవ మఠాధిపతి. ఐహిక సుఖాలన్నీ దూరం చేసుకొని కోరికలన్నీ కోసివేసుకొని, కఠోర బ్రహ్మచర్యం అవలంబించి, క్రైస్తవ ధర్మం అనుష్ఠిస్తూ ఈశ్వరారాధనలో ఆత్మానందాన్ని దర్శిస్తున పప్నూటియస్‌ పేరు క్రైస్తవ సన్యాసులందరిలోను ప్రసిద్ధి.

పాపకూపంలో పడి కొట్టుకుంటున్న థాయిస్‌ను ఉద్ధరించాలనుకున్నాడు. పప్నూటియస్‌ అందుకు పూనుకున్నాడు. ఎన్నెన్నో కష్టాలు పడ్డాడు. అడుగుపెట్టరాని చోట అడుగుపెట్టాడు. అవమానాలు భరించాడు. ఆఖరుకు కార్యం సాధించాడు. పడుపు వృత్తిలో పడి కొట్టుకుంటున్న థాయిస్‌ను ఉద్ధరించాడు. ఆమెకు ఆత్మజ్ఞానం ఉపదేశించాడు. ఆమెకు ఈశ్వరతత్వం బోధించాడు. ఆమెకు సన్యాసం ఇప్పించి దైవసాన్నిధ్యంలో ఉంచాడు.

ఆ తరవాత ఏం జరిగింది...?

తెల్సుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

పేజీలు : 184

Write a review

Note: HTML is not translated!
Bad           Good