తేలిక తెలుగు వ్యాకరణం 1, 2 - వాడవల్లి ప్రసన్నాంజనేయ శర్మ
ఈ ఆంధ్ర వ్యాకరణ పారిజాతము ఉన్నత తరగతుల వరకు బోధించవలసిన ప్రాథమిక వ్యాకరణ ఛందోలంకార విషయాల కరదీపిక. అధ్యాపకులకు విద్యార్థులకు సంప్రదింపు సహాయినిగా ఉపయోగపడుతుంది. పాఠ్యప్రణాళికననుసరించి ఆయా తరగతులు వయో జ్ఞాన స్థాయులకనుగుణ్యముగా కూర్పబడింది. విద్యార్థుల సౌలభ్యానికై పాఠ్య పుస్తకాల ఆధారంగా లక్ష్య లక్షణ అభ్యాసాలు ఇవ్వబడ్డాయి.
ఈ ఆంధ్ర వ్యాకరణ పారిజాతము విద్యార్థుల సౌలభ్యం కోసమే ప్రథమ, ద్వితీయ భాగాలుగా విభజింపబడింది.
తెలుగు మాతృభాషగా చదివే విద్యార్థులకు ప్రథమ భాగం ప్రాథమికోన్నత తరగతుల వరకును; ద్వితీయ భాషగా చదివేవారికి ఉన్నత తరగతుల వరకును ఉపయోగపడుతుంది.
తెలుగు మాతృభాషగా చదివే విద్యార్థులకు ద్వితీయ భాగం ఉన్నత తరగతుల వరకు ఉపయోగపడుతుంది.
''బాలపదకోశము'' పాఠ్య పుస్తకాల్లోని ''ప్రకృతి వికృతులు, వికృతి ప్రకృతులు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యత్పత్త్యర్థాలు, పారిభాషిక పదాలు, జాతీయాలు - వాక్యప్రయోగాలు'' నిఘంటు పద్ధతిలో కూర్పబడ్డాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good