తెలుగునాట జరిగిన ఉద్యమాల మూలాల్లోకి దృష్టి సారించి ఏవి ప్రజా ఉద్యమాలో పసిగట్టాడు. సంఘటిత ప్రజాశక్తి ముందు ఎలాంటి రాచరికపాలనా, నిరంకుశపాలనా నిలవలేదన్న సత్యాన్ని వేనోళ్ళచాటాడు. ఉద్యమాలను విశ్లేషించే సందర్భాల్లో ఎర్రగాలులకు ఆహ్వానం పట్టాడు. ఎర్రకాంతులకు నీరాజనాలిచ్చాడు. కార్మిక జన గణానికి మంగళం పల్కాడు.

''నీ కవిని బ్రతికించుకోవాలిరా! నీవు మనిషనిపించుకోవాలిరా'' అంటూ సాహిత్య ప్రియులకు పోషకులం అనుకునే ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. కూలి చాలని పేదలు ప్రభువుల సేవల్లో ఎలా నలిగిపోయారో దేవుని మోసే బోయీల పేరుతో కూలి చాలనితనంపై సరిపడే కూలి అడగమంటాడు. ఆ అడగడాన్ని ''అన్నాలు చాలవని అడంగడిరా'' అంటాడు. ఆయన గేయాలలో సహజమయిన ఆలోచనకు విజ్ఞానఖనియైన రచయిత భావనలు జోడించి కవితా రూపం ఇచ్చాడు.

స్థానికంగా కార్మిక సంఘాల నిర్మాణం ప్రోత్సహించేవాడు. మహిళలలో చైతన్యం రావాలని కోరేవాడు. విద్యార్థుల దేశ కాలపరిస్థితులు అర్థం చేసుకోవాలని ఆయనకు గట్టి అభిప్రాయం వుండేది.

'సినిమా' - ప్రజల్ని చైతన్యవంతం చేయగల సాధనం అని, సినిమా పరిశ్రమలో ప్రవేశించాలని దాని సాంకేతిక సాహిత్యం అధ్యయనం చేశాడు సూరి. అందుకు తగినట్టు 'టాకీ టెక్నిక్‌' అనే గ్రంథం వ్రాశాడు. తన గేయాలు 'అరుణరేఖలు' అనే పేరుతో ప్రచురించాడు. - శ్రీ మైత్రేయ

Pages : 222

Write a review

Note: HTML is not translated!
Bad           Good