తెన్నేటి సూరి

తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు, ఆత్మాశ్రయమైన భావకవిత్వంపై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తొలి విడత 'అభ్యుదయ కవులలో' 'తెన్నేటి సూరి' ఒకరు.

'నీ కవిని బతికించుకోవాలిరా - నీవు మనిషనిపించుకోవాలిరాౖ!....' అని పలికిన ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడైన తెన్నేటిసూరి - బి.ఎ. పట్టభద్రుడు. సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు. పేదరికంతో సహా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు ఎదుర్కొనే అన్ని రకాల జీవిత సమస్యలను ఎదుర్కొన్నాడు. యువకునిగా వుండగానే జీవితాన్ని కాచి వడబోసుకున్నాడు. బందరు జవార్‌పేటలో 'ప్రభాత్‌ ప్రింటింగ్‌ ప్రెస్సు'ను నడుపుతూ వుండేవాడు. ఆ రోజులలో ఆయనకు కమ్యూనిస్టు భావాలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఆయనలో కొత్త ఆలోచనలను, భావ విప్లవాన్ని కలిగించింది. బందరులో భుక్తి గడవక ఆయన మద్రాసు చేరుకున్నాడు. ఆంధ్రపత్రిక యజమాని, సంపాదకులైన - శివలెంక శంభు ప్రసాద్‌గారు 'భారతి' బాధ్యత అప్పగించి సూరికి ఒక 'బతుకుతెరువు'ను ఏర్పాటు చేశారు. భారతిలో పని చేస్తూవుండగానే ఆంధ్రపత్రికలో 'ఛార్లెస్‌ డికెన్సు' నవలను 'రెండు మహా నగరాలు'గా తెలుగు పాఠకులకు అందించాడు. ఇది సూరికి ఎనలేని కీర్తిప్రతిష్ఠలను చేకూర్చింది. 1945 నుంచి 1957 వరకు పత్రికారంగంలో పనిచేసిన సూరి మరో చారిత్రాత్మక రచన 'ఛంఘిజ్‌ఖాన్‌' నవలనూ, - 'సాహిత్య సమవాకారం' అనే మరో అద్భుతమైన 'సెటైర్‌'నూ అందించాడు. 'సీరపాణి', 'తె.సూ', మఫ్టీ - అనే మారు పేర్లతో కొన్ని విమర్శ వ్యాసాలను రచించాడు. ఇందులో కధా సంపుటాలు
1. విప్లవ రేఖలు     2. సుబ్బలక్ష్మి కధలు  3. మరికొన్ని కధలు
4. అనువాద కధలు
కవితలు- అరుణరేఖలు కవిత సంపుటి, నాటికలు,

Write a review

Note: HTML is not translated!
Bad           Good