ప్రపంచ యాత్రీకుడే నిజముగా అదృష్టవంతుడు. ఇట్టి అదృష్టము, అవకాశము మనవారిలో ఎవరికో కొందరికి తప్ప, సాధారణముగా అందరికిని లభించుట ఈ కాలమున కష్టతరము. నాలుగు అయిదు మాసములలో నేను ప్రపంచమంతటిని చుట్టి వచ్చినానని చెప్పినదానితో యాత్ర యొక్క ఫలితము మనకు దక్కదు.

యాత్ర ఒకవిధమగు కళోపాసన. యాత్రికుడు తత్త్వవేత్త, సాహిత్య, లలిత కళల నాస్వాదము చేసిన దిట్టరి. అణకువ, వినయము గలవాడై యుండవలయును. - వి.ఎన్‌.శర్మ

లోక జ్ఞానం కలగాలంటే ముందు ఇల్లు విడిచిపెట్టాలి మనిషి,

ఊరు విడిచిపెట్టాలి

తాలుకా దాటాలి

అటూ యిటూ జిల్లాలు దాటాలి

కనీసం, ఎడా పెడా అయినా ఖండాలు దాటాలి

అప్పుడవుతాడు మనిషి - అనుభవపరుడు 

- శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

Pages : 520

Write a review

Note: HTML is not translated!
Bad           Good