తెలుగు జాతి యొక్క ప్రాచీన వైభవం గురించి తెలుగు భాష, సంస్కృతి గురించి పిల్లలకు అవగాహన, చైతన్యం కలిగించటం కోసం శ్రీకృష్ణదేవరాయలు, శంకరంబాడి సుందరాచారి, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, త్రిపురనేని రామస్వామి చౌదరి, జాషువా, దేవులపల్లి, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, దాశరథి, కాళోజి, సి.నారాయణరెడ్డి, బాలాంత్రపు రజనీ కాంతారావు, వేములపల్లి శ్రీకృష్ణ మొదలగు కవుల పద్యాలు, గేయాలు ఈ పుస్తకంలో పరిచయం చేశాం. ఆయా కవుల గురించి కూడా పిల్లలకు ఒక అవగాహన కల్పించటం మా ఉద్దేశం. తెలుగు భాషకు దూరమవుతున్న ఈ నాటి పిల్లలు ఈ గేయాలు చదువుకొని తప్పకుండా గొప్ప స్ఫూర్తి పొందగలరని ఆశిద్ధాం... |