కొండను చూడ్డానికో అద్దం
ఇది అభ్యుదయ రచయితల సంఘం సంక్షిప్త చరిత్ర. సాంస్కృతిక, సాహితీ పరిరక్షణ పోరాటాగ్నిలోంచీ శ్రామికజన సాహితీ సాంస్కృతిక పరిరక్షణోద్యమాల సమర జ్వాలల్లోంచి ఉద్భవించిన కమలం అభ్యుదయ రచయితల సంఘం. అంతర్జాతీయ సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లోంచి 1935లో ఆరంభమైన ఈ ఉద్యమం 1936లో వలసవాద దోపిడీ, దౌర్జన్యాల, అణచివేతల దాష్టీకాలలోంచి, జాతీయవాద భావజాల స్ఫూర్తి నుంచీ అభ్యుదయ రచయితల సంఘం (అ.ర.సం.) అవతరించింది.
1943లో తెలుగునాట విభిన్న సాహితీ భావజాలాల మధ్య, అంతర్జాతీయ విముక్తి పోరాటాల స్వేచ్ఛా వాయువులు బలంగా వీస్తున్న కాలంలో అ.ర.సం. వేళ్లూనింది. నాటి నుంచి నేటివరకు అనేక ఆటంకాలను, అవరోధాలను, నిర్బంధాలను, వెటకారాలను ఎదుర్కొంటూ నిలబడింది. ఇప్పటి వరకూ సాహితీ రంగంలో ప్రవేశించిన అనేక ఉద్యమాలనూ, ప్రక్రియలనూ వాటిలోని మంచి చెడ్డలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ మంచిని ప్రోత్సహిస్తూ కొత్త తరాన్ని ఆహ్వానిస్తూ ముందుకు సాగుతున్నదనడానికి ఈ 75 ఏళ్ల ప్రస్థానమే సాక్ష్యం. చీలికలు వచ్చినా అతివాద, మితవాద రాజకీయ భావజాలాల పొత్తిళ్లు కుదిపినా స్థైర్యంతో తన పంథాలో ముందుకు సాగి పోతూనే ఉంది.....
పేజీలు : 40