ఈ పుస్తకం మొదట ప్రచురించగానే ఇందులో ఆలోచనలు, ప్రతిపాదనలు, సిద్ధాంతాలు వెంటనే అందరూ ఆమోదించేస్తారని నేను ఎదరు చూడలేదు. ఆ మాటకొస్తే అందరూ ఈ పుస్తకాన్ని పొగిడేస్తే ఒకవిధంగా నేను నిరుత్సాహపడి ఉండేవాణ్ణి, ఒక పుస్తకంలోని ఆలోచనలను చంపేయాలంటే పొగిడేయడం ఒక పద్ధతి. నా పుస్తకానికి ఆ గతి పట్టనందుకు నేను సంతోషించాను. పది మంది విమర్శకులూ ఈ పుస్తకాన్ని విమర్శించడంతో పట్టుదలతో తపలడినందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞుణ్ణి. రచయిత చివరిమాట నుంచి

ఈ గ్రంథాన్ని చదివిన ప్రతి సారీ ఎన్నో కొత్త విశేషాల కనిపిస్తుంటాయి. విషయాన్ని ఎంతో లోతుగా, నవిశితంగాఈ పరిశీలించి నారాయణ రావుగారు విశదీకరించిన గాఢమైన అవగాహనలను ఆంధ్రదేశంలోని విమర్శకులు అందుకుంటారని ఆశిస్తున్నాను. వీరు చూపిన భవిష్యత్తు పరిశోధక నాంశాలు, ఈ పుస్తకంలోని తన వాదనలను ఎదుర్కోవడానికి విరే సూచించిన పరిశీలన మార్గాలే చాలు మన విశ్వవిద్యాలయాలను ఎంతోకాలంపాటు క్షణం తీరిక లేకుండా ఉంచడానికి. నాకెంతగానో నచ్చిన మరోక అంశం, రచయిత రాసిన వచనం, శాస్త్రీయ, విశ్లేషణాత్మక విషయాలను కూడా సూటిగా, స్పష్టంగా , పదునుగా, అందంగా చెప్పవచ్చునని చూపించారు. - కె.వి.ఎస్‌.రామారావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good