అభ్యుదయ సాహిత్యోద్యమం

పరిచయం : 'అభ్యుదయం' అనే మాటకు మంగళం, శుభం అనే నైఘంటికార్థాలు ఉన్నప్పటికీ ఆధునిక సందర్భంలో 'ప్రోగ్రెస్‌' అనే మాటను వాడుతున్నాం. పురోగమనం, ప్రగతిశీలమనే స్థూలార్థాన్ని గ్రహిస్తున్నాం. తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యం, శ్రామికజన పక్షపాతం, వాస్తవికత, పీడిత జనపక్షం, సమసమాజ నిర్మాణం మొదలైన అంశాలను అభ్యుదయ సాహిత్యం ప్రవేశపెట్టంది.

పూర్వరంగం : అభ్యుదయ సాహిత్యం తెలుగులో ఒక ఆధునిక సాహిత్యోద్యమం. దీని ఆవిర్భావానికి అంతర్జాతీ, జాతీయ, స్థానిక పూర్వరంగం ఉంది. 'ఆధునికత'ను చర్చించకుండా, అభ్యుదయాన్ని విశ్లేషించడం సాధ్యం కాదు.

ఆధునికత : శతాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థ మీద తిరుగుబాటును లేవదీసి, కొత్త వ్యవస్థను, కొత్త జీవన విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆధునికత అంటున్నాం. ఇది కేవలంకాలవాచి మాత్రమే కాదు. కాలం దాని పాత్రను అది నిర్వహించినప్పటికీ, కాలంతో పాటు ఇతర మౌలికాంశాలు ఆధునికతను అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి.

''సంప్రదాయాలనూ, సాంప్రదాయకమైన విశ్వాసాలనూ, ఆచారాలనూ, నిర్వమ కారంగా విసర్జించి, ప్రతి సమస్యనూ ఆధునిక విజ్ఞానశాస్త్రాల సహాయంతో, హేతువాద దృష్టితో పరిశీలించడం ఆధునికత అని ప్రముఖ సాహిత్య విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి నిర్వచించారు.

తెలుగువారు తెలుగు నేలపై 37 ఏళ్ళ విరామం తరవాత చేసుకుంటున్న పండుగ ప్రపంచ తెలుగు మహాసభలు. మన సంస్కృతిని నలుదిశలా వ్యాపింపజేస్తున్న తెలుగు వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచుకునేందుకు, తెలుగు పరిమళాలు వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు వారి సంస్కృతి బహుముఖీయమైంది. అందులో భాష, సాహిత్యం, చరిత్ర, లలితకళలు, జానపద, గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి విశ్లేషించుకొని, వాటిని పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది....

పేజీలు : 87

Write a review

Note: HTML is not translated!
Bad           Good