తెలుగులో వ్యాసం మీద పఠన పరిశోధనలకు ఇదొక్కటే పాఠ్యాంశమయింది. ఆధార గ్రంథమయింది. పరిశోధకులకు ఆకార గ్రంథమయింది. అనేకులు, దాదాపు నూరేళ్ళలో వ్రాసిన వ్యాస సాహిత్యం దర్శనీయమయింది. సాహిత్యం మీద, భాష మీద, విభిన్న సామాజికాంశాల మీద మేధావులు, పరిశోధకులు, విమర్శకులు తమ అభిప్రాయాలు, భావాలు, వ్యాసాలు అందిస్తే ఆయా వ్యక్తుల శక్తియుక్తులు ఆయా వ్యాసాల విషయాలు, రచనారీతులు విశ్లేషణం విశదీకరణం పొందాయి. తెలుగు వచన శైలి దర్శించటానికి ఇందులో పునాదులు గోచరమవుతాయి. నన్నయ వచనం పొందిన పరిణామం తెలియటంతో పాటు తెలుగు వచన తత్వం ఇందులో ప్రత్యక్షమవుతాయి. పండితుల, పెద్దల, మేధావుల, వాద నివాదాలు, వాటి తీరుతెన్నులు చదువరులకు ఈ గ్రంథంలో దృగ్గోచరమవుతాయి. వేరు వేరు కారణాల వల్ల అవసరాల వల్ల 'తెలుగు వ్యాస పరిణామం' అవశ్యంగా, అత్యవసరంగా పఠనీయ గ్రంథమయింది.

పేజీలు : 535

Write a review

Note: HTML is not translated!
Bad           Good