Rs.81.00
In Stock
-
+
తెలుగుకు పదాల ఉచ్చారణ సౌలభ్యం, శబ్ద మాధుర్యం, భావ విస్తృతిసౌకర్యం ఉన్నాయి.
భాషకు పదసంపద ఎంత ముఖ్యమో, వ్యాకరణమూ అంత ముఖ్యమే. బలమైన రాళ్ళను పేర్చి గోడను నిర్మించాలన్నా, అవి కదలకుండా ఉండటానికి వాటి మధ్య సిమెంటు, ఇసుకల మిశ్రమం అవసరం. అలాగే మనం మాట్లాడే పదాలు ఎదుటివారికి అర్థమయ్యేలా చేసే మాధ్యమం వ్యాకరణం.
నేను నిన్న అన్నం తింటాను అనం కదా! విడివిడిగా నిన్న, అన్నం, నేను, తినుట అనే పదాలకు అర్థాలు ఉన్నాయి. కానీ వాటినన్నింటినీ కలిపి ఒక వాక్యంగా మార్చి, ఒక భావాన్ని ఇతరులకు అందచేయాలంటే వ్యాకరణం అవసరం.
ఈ పుస్తకంలో తెలుగు భాషను సరిగా రాయడానికి, మాట్లాడటానికి తెలుగు ప్రాచీన గ్రంథాలను చదివి అర్థం చేసుకోవడానికి అవసరమైన వ్యాకరణ సూత్రాలు, పారిభాషిక పదాలు అన్నీ అందచేశాము....
పేజీలు : 348