హిందువుల ఆధ్యాత్మిక జీవనంలో పండుగలకు విశిష్టమైన స్ధానం ఉంది. జనుల్లో సామాజిక చైతన్యాన్ని, ధార్మిక వాతావరణాన్ని, ఏకతా భావాన్ని, జాతీయ జీవన మూల్యాలను పెంపొందించడానికి పండుగలలో మంచి ఉపకరణాలు. ఒక జాతి సంస్కృతిని ఆదేశ ప్రజలు ఆచరించే పండుగల్లో దర్శించవచ్చు. మనిషి అలసటకు, ఆవేదనకు కారణమౌతున్న వేగవంతమైన యాంత్రిక జీవనంలో పండుగలు సేద తీర్చే మజిలీలు.
ఈ పుస్తకంలో 60 పండుగలను గురించిన విశేషాలు ఉన్నాయి. అవి ఆయా పండుగల పౌరాణిక, చారిత్రక నేపధ్యాన్ని వాటి మూలాలను ప్రధానం చర్చించడం జరిగింది. కేవలం పండుగలు నిర్వహించే విధానం అందరికీ సుపరిచితమే. అందువల్ల వాటిని సంబంధించిన పురాణ గాథలకు ఎక్కువ ప్రాముఖ్య ఇవ్వడం జరిగింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good