ఏ ప్రాంత చరిత్ర, సంస్కృతుల పట్ల ఆ ప్రాంత ప్రజలకు మక్కువ వుంటుంది. మమకారం కూడా వుంటుంది. అయితే వారి పుట్టుపూర్వోత్తరాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి అందరికి అవగాహన ఉన్నపుడే ఘనమైన వారి వారసత్వాన్ని కాపాడుకోవాలన్న తపన పుడుతుంది. విద్యార్థి దశ నుంచే గ్రామాలు, పట్టణాలు, నగరాల చరిత్రను, కట్టడాలను, కళలను గురించి వివరించినప్పుడే వారసత్వ పరిరక్షణలో అందరూ భాగస్వాములౌతారు. విద్యార్థులను ఆధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. అందుకనే ముందుగా ఉపాధ్యాయులకు వారసత్వ సంపద గురించి తెలియజెప్పి, వారి ద్వారా విద్యార్థులకు తెలియజేయాలన్న సంకల్పంతో ఉపాధ్యాయ, విద్యార్థులకు చేదివ్వెగా ఉపయోగపడాలన్న ఉద్దేశ్యంతో తెలుగు వారి వారసత్వం అన్న పుస్తకాన్ని తీసుకువచ్చారు రచయిత. - చెన్నూరు ఆంజనేయరెడ్డి.

Pages : 288

Write a review

Note: HTML is not translated!
Bad           Good