Rs.120.00
In Stock
-
+
ఈ తరానికి ఈ కథలు ప్రాణం పోస్తాయి. హాయిగా కష్టాలు, సుఖాలు అన్నింటిని అనుభవించండిరా అని చెబుతాయి. బతుకును బతకమని చెప్పేదే గొప్ప సాహిత్యమనుకుంటా. మనుషుల్ని వాళ్ళలాగే, మనుషులుగానే చూడటం గొప్ప కళ. యేమీ ఆపాదించరు. ఆశించరు. వాళ్ళను వాళ్ళుగానే బ్రతకమంటారు. బాగుపడమని, చెడిపొమ్మని చెప్పరు. దోసిలినిండా జీవితముంది తొంగిచూడండి - తాగిచూడండి అనికూడా వాచ్యంచేయరు. ఆయన కథలు చదివితే అలా అనిపిస్తుంది.
ఈ పుస్తకంలో మా వూరు, యక్షగానం, మనోరమ, తూముకుంటబంగ్లా, ఆశ, గుర్రం ఎగిరింది, బతుకు భారం, మృత్యుంజయుడు, మళ్ళీ... మొదటికొచ్చింది, నన్ను మరచిపోయిండేమో!, ఆమెచూపు, తమ్ముడు శ్రీశైలం, వలసపక్షులు, బాల్కనీ, భూభాగోతం, మా వదిన, ఉర్లుగొండ జాతర, భక్తి - ముక్తి, గోడకున్న బొమ్మ, స్టార్ బుక్‌హౌస్ అనే 20 కథలు ఉన్నాయి.