Rs.60.00
Out Of Stock
-
+
పూర్వం కృష్ణాతీరం నేపథ్యంలో వచ్చిన 'అమరావతి కథలు' ఒరవడిలో ఎలాంటి బ్రేకులు లేకుండా సాగే 'పొగబండి కథలు' మనకందించిన ఓలేటివారికి అభినందనలు. - మల్లాది వెంకటకృష్ణమూర్తి
జీవితాన్నీ, జీవిక కోసం చేపట్టిన వృత్తినీ మనసారా ఆస్వాదించగలిగే వ్యక్తికి మాత్రమే ఆసక్తికరమైన కథనాలతో నలుగురినీ మెప్పించగలిగే తలపోతలుంటాయి. ఇక, ఆ వ్యక్తి సమర్ధుడైన రచయిత అయితే చెప్పే పనిలేదు. తన స్మృతిపేటికలో భద్రపరచిన ఒక్కో జ్ఞాపకాన్నీ చక్కని చిక్కగా కథగా అక్షరబద్ధం చేయగలుగుతాడు. ఓలేటి శ్రీనివాసభాను 'పొగబండి కథలు' అందుకు నిలువెత్తు నిదర్శనం. రైల్వేలకు చెందిన సాంకేతిక విషయాల జోలికి అంతగా పోకుండానే ఆ జీవిత పార్శ్వాలనీ, అపురూప కోణాలనీ ఆర్థ్రంగా చిత్రీకరించిన కథలివి. నిత్య జీవితంలో ఇతర సామాజిక వర్గాలతో కలగలసిపోతూనే కాస్త ఎడంగా ఉన్నట్టు తోచే రైలు బతుకుల్లో విస్మయపరచే బతుకులెన్నో ఉన్నాయి. వాటిని ఒడుపుగా పట్టుకొని పదేపదే చదివించే కథలుగా మలచడంలో రచయిత సఫలీకృతుడయ్యాడని నా నమ్మకం. ఈ కథలు చదివాక మీరూ ఆ మాట కాదనలేరు. - పంతుల జోగారావు