తెలుగు భాషకు  సంస్కృతి కి సంబంధించిన అపురూపమైన పుస్తకమిది. నూటనలభై ఏళ్ళ కిందట ఇక్కడ చలామణిలో వున్న సామెతలను తద్వారా అప్పటి సమాజాన్ని సందర్శించే అవకాశం కలిగించే పుస్తకం. ఆంగ్లేయ అధికారిగా వచ్చిన కెప్టెన్ ఎం.డబ్ల్యుకార్ విశేషమైన శ్రద్ధాసక్తులతో సేకరించి ఆంధ్ర లోకోక్తి చంద్రిక పేరిట ప్రచురించారు. ఆ సామెతలకు ఇంగ్లీషులో వివరణతో పాటు సమానార్థకమైన ఆంగ్ల సామెతలు పొందుపరిచారు. తెలుగు భాష వెనకపట్టు పట్టి ఆంగ్లభాషా వ్యామోహం పెరిగిపోతున్నదని అందరూ అంటున్న ప్రస్తుత నేపథ్యంలో అలాంటి వారికి ఇదో అదనపు ఉపయోగంగానూ భావించవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good