సుమారు మూడు వందల సంవత్సరాల క్రతం కాలం కడుపుతో వుండి ఓ యిద్దరు తెలుగు సాహితీ ముద్దు బిడ్డల్ని కని తననితాను ఆవిష్కరించుకొంది. ఆ యిద్దరిలో ఒకరు వేమన, మరొకరు వీరబ్రహ్మం. నిజానికి ఆ యిద్దరూ మొదట ఉద్యమకారులు ఆ తర్వాత కవులు. వేమన, వీరబ్రహ్మం లాంటి యిద్దరు మహాకవుల మీద, గొప్ప ఉద్యమకారుల మీద నేను చేస్తోంది విశ్లేషణ కాదు - సంభాష మాత్రమే. ఎందుకంటే నేను కవిని కాదు. విమర్శకుడ్ని అంతకన్నాకాదు. అందుకే కవిగా, విమర్శకుడిగా, విశ్లేషకుడిగా కాకుండా కేవలం పాఠకుడిగా నాకు తెలిసిన, నేను అర్థం చేసుకొన్న వేమనని, వీరబ్రహ్మంని మీ ముందు వుంచుతున్నాను. ఆ యిద్దర్ని చదివాక నేను పొందిన అనుభూతిని, అనుభవాన్ని మీతో పంచుకొంటున్నాను. ఓ చిన్న కాలినడక యిది.

పేజీలు : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good