కొంతమంది ఆయా యుగాల సాహిత్యాన్ని గూర్చి విశేషమైన గ్రంథాలు రచించారు. మరికొంతమంది కొన్ని ప్రక్రియల చరిత్ర, పరిణామ క్రమాల్ని వివరించారు. అలా కాకుండా కవుల జీవితాలు, చరిత్రలు, సాహిత్య చరిత్రలు విస్తృతంగా, గానీ, సంగ్రహంగా కానీ రాసినవారూ ఉన్నారు. కవుల చరిత్రల్ని, సాహిత్య చరిత్రల్ని రచించిన వారిని గూర్చి పరిచయం చేసే ప్రయత్నం చేశాను. నా సేకరణలో 20 మంది సాహిత్య చరిత్రకారుల్ని గుర్తించ గలిగాను. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. సాహిత్య చరిత్రకారుల జీవితం, రచనలు పరిచయం చేసే అవకాశం ముందుగా నాకు లభించటం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయా రచయితల జన్మకాలాన్లను బట్టి వరుస క్రమాన్ని నిర్ణయించాను. కొందరి జన్మ తేదీలు లభించకపోవటంతో జన్మ సంవత్సరాన్నే ప్రాతిపదికగా తీసుకొన్నాను. - గుమ్మా సాంబశివరావు |