తెలుగు సాహిత్యం పై మహాకవి శ్రీ శ్రీ ప్రభావం - డాక్టర్‌ కడియాల రామమోహన్‌ రాయ్‌

మహాకవి శ్రీశ్రీ రచనలతో ఆంధ్ర సాహిత్యం మలుపు తిరిగి సామాజిక శ్రేయస్సే లక్ష్యంగా ప్రయాణించింది. అంతవరకూ వచ్చిన నవ్య కవితారీతులు పాతబడిపోయి, ఆధునిక కవిత్వం ఛందోమార్గం విడిచి స్వచ్ఛంద మార్గాన్ని (హవతీరవ - కూఱపతీవ) అనుసరించింది. బోల్షివిక్‌ విప్లవానంతరం విశ్వవ్యాప్తమవుతున్న 'మార్క్సిజం' తెలుగు సాహిత్య వేత్తలకు ఆదర్శమార్గంగా తోచింది. సమాజంలో అణగారిన ప్రజలు, నిత్యమూ దోపిడీకి గురవుతున్న దీనులు, హీనులు, బాధా సర్పదష్టులు కవులకు కావ్యవస్తువులైనారు. దగాపడిన తమ్ములార! మీ కోసం కలంపట్టి ఆకాశపుదారులంట హడావుడిగా వెళ్లిపోయే జగన్నాథుని రథచక్రాల్‌ రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అని శ్రీశ్రీ 'ప్రతిజ్ఞ' చేశారు. ఒక వ్యక్తిని మరొకవ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇకపై సాగదని ప్రకటించి 'పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి' అని శ్రామిక లోకపు స్వర్గమైన మరో ప్రపంచానికి 'మహాప్రస్థానం' సాగించారు. 1930 తర్వాత ఆధునిక భాషా, చేతనతో సాహిత్యసృష్టి చేస్తున్న తెలుగు రచయిత లెవ్వరూ శ్రీశ్రీ రచనల ప్రభావాన్ని తప్పించుకోలేకపోయినారనటం అతిశ యోక్తి కాదు'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good