విద్యార్థులు, జీవితంలో నిరాశ, నిస్పృహలకు లోనైనవారు, వయోజనులు తప్పక చదవాల్సిన గీతా సారాంశం!

ఈ చిరు పుస్తకంలో - ఆత్మ, కర్మ, భగవంతుడు-ప్రకృతి, సత్కర్మ, ఆత్మ నిగ్రహం, ధ్యానం, నిరీశ్వరవాదం, భక్తి-ఈశ్వరకృప; పరమాత్మ సందర్శనం మొదలగు విషయాలపై శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతను వివరించాం.

ఆత్మ-దేహం గతించినా, ఖననం అయ్యాక లేదా చితిలో దగ్ధం అయ్యాక కూడా నశించదు. మరణం చూసి దుఖించడం అవివేకం. ఎందుకంటే ఆత్మకి మృత్యువు వుండదు. మృత్యువుతో పోయేది దేహం మాత్రమే. మనిషి చిరిగిన బట్టల్ని వదిలిపెట్టినట్లుగా ఆత్మ కృశించిన శరీరాన్ని వదిలి కొత్త దేహం పొందుతుంది.

ఇంద్రియ నిగ్రహం, స్వచ్ఛమైన నడవడిక, ఆరాధనని, పనిని, ఆహారాన్ని, నిద్ర వగైరాలను, దైనందిన జీవితాన్ని నియమబద్ద్ధం చేసుకోవాలి.

కర్మ, ఫలాపేక్షను ఆశించకుండా నిస్వార్థంగా నీ పనిని శ్రద్ధాళువువై చెయ్యాలి. ఎవరి స్వధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి. కర్మను ఆచరించడంలో వైఫల్యాలు, ఇక్కట్లు ఎదురైనాగానీ, సు:ఖదు:ఖాలని, విజయ, వైఫల్యాలను; ఆశ, నిరాశల్ని సమదృష్టితో చూడాలి.

ఇక సంపద విషయానికొస్తే నీవు ఈ లోకంలోకి వచ్చినపుడు వట్టి చేతుల్తోనే వచ్చావు. వెళ్ళేటప్పుడు అలాగే వెళ్తావు. కనుక పోగొట్టుకున్న దానికోసం విచారించకు. రానిదానికోసం బాధపడకు. ఉన్నదాంతో తృప్తిగా వుండు. నేడు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం. రేపు మరొకరి సొంతం. అయిందేదో మంచికే అయింది. అవుతున్నదేదో మంచికే అవుతుంది. అవ్వబోయేది కూడా మంచికే అవుతుంది అనుకో. ఇదే సంక్షిప్త గీతా సారాంశం!

Pages : 63

Write a review

Note: HTML is not translated!
Bad           Good