ప్రచురణ అనగానే మనకి వావిళ్లవారు, కొండపల్లి వీరవెంకయ్య, వేంకట్రామ అండ్‌ కో ... ఇలాటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు తెలుగుజాతికి సాక్షరతాసాధన క్రమంలో నిర్వహించిన పాత్ర అనన్య సామాన్యం. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలే కాకుండా సామాజిక, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో వినోదాన్ని, విజ్ఞానాన్ని సామాన్య పాఠకులకు అందుబాటులో ఉండే విధంఆ ఏర్పాట్లు చేసిన ప్రచురణ కర్తను మనం ఎప్పటికీ మరచిపోలేం. ఈనాటి పుస్తక ప్రదర్శన మ¬త్సవాల్లో ఆముష్మిక విషయాల నుండి ఐహిక విషయాల వరకు అందుఆటులో ఉన్న సకల సమస్త విజ్ఞానానికి మూలకారకుడు ప్రచురణకర్త. అనేక అద్బుతమైన రచనలు ఎంతో అందంగా వెలుగులోకి తెచ్చేది ప్రచురణకర్తలే.

ఈ రంగం సేవాభావంతో మొదలై, వృత్తిగా రూపుదిద్దుకొని ప్రస్తుతం వ్యాపార పరిశ్రమల స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో గతంలో ఉద్యమస్ఫూర్తితో పనిచేసిన, అంకితభావంతో మెలిగిన ప్రచురణ సంస్థలెన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఈ కథనంతా వివరిస్తూ ప్రచురణరంగానికి సంబంధించిన సమాచారం సేకరించి నిక్షిప్తపరచిన భాండాగారమిది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good