నా మనసు నాటిన ఆశాబీజం మారాకు వేసింది.
మరికాస్సేపటికల్లా ఆటలు ముగించి, బిలబిల్లాడుతూ వచ్చి పడ్డారు మూగ్గురు పిల్లలూ.
వాళ్ళనికాళ్ళూ చేతులూ కడుక్కు రమ్మని పంపి, నేను కంచాలూ మంచినీళ్ళూ సిద్ధం చేశాను. వస్తూన్న మాకు దారిలో రాజా కారాపి పలకరించిన విషయం అమ్మకి చెప్పాలా వద్దా అన్న సందిగ్ధావస్థలో పడానుకాస్సేపు.
మా అమ్మ మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. కారణం లేకుండానే అరుస్తుందొకోసారి. రాజా పలకరించిన విషయం చెప్తే-
"పరాయి మగాడితో రోడ్డుమీద కబుర్లేమిటి?" అనచ్చు. చప్పకపోతే ఏ యశోదమ్మగారి ద్వారానో తెలుసుకుని "రాజా దార్లోనేమీక్కనిపించి పలకరించాడా! ఆ విషయం నాకు చెప్పలేదేం?” అని గద్దించవచ్చు. అందుకే ఏం చెయ్యాలోఅన్నట్టుకాస్సేపుడైలమాలో పడిపోయాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good