2017 మే 26, 27, 28 తేదీలలో సెయింట్‌ లూయిస్‌ నగరంలో తానా 40వ వార్షికోత్సవం జరిగిన 21వ మహాసభల సందర్భంగా రెండు లక్షల రూపాయల బహుమతి మొత్తంగా తానా నవలల పోటీని నిర్వహించింది. ఈ పోటీకి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి, అమెరికా, ఇంగ్లాండ్‌ల నుంచి 55 నవలలు వచ్చాయి. ఈ నవలలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం,  ప్రకటించిన రెండు లక్షల బహుమతి మొత్తాన్ని మూడు నవలలకు అందించారు. వాటిలో బండి నారాయణస్వామి రచించిన ఈ నవల 'శప్తభూమి' ఒకటి.

శప్తభూమి రాయలసీమ చరిత్ర నేపథ్యంగా రాసిన నవల. రాయల కాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు, అప్పటి జీవితము చిత్రించిన చారిత్రాత్మక నవల. హండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలు, కార్పన్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ల దౌర్జన్యాల సమాహారం ఈ ''శప్తభూమి''.

Write a review

Note: HTML is not translated!
Bad           Good