ఏమన్నాడు ? "నువ్వు పొతే, నీలాంటి వాళ్ళని నలుగురిని భార్యలుగా తెచ్చుకోగాలను" అన్నాడు. అన్న వెంటనే జ్యోత్స్న అతడి చెంప చెళ్ళుమనిపించింది. చెంప పట్టుకుని నిశ్చేష్టుడిగా నిలబడ్డాడు. శ్యామసుందర్. అత్తగారు అపరాకాళికలా వచ్చి విరుచుపడింది. "వాడికి కోడతావుటే! నువ్వు మనిషివేనా ! ఆడదానివేనా?"
"ఇది మా ఇద్దరి విషయం ! మధ్య మీరు కల్పించు కోకండి వెళ్ళండి. " తీవ్రంగా అంది జ్యోత్స్న
అయ్యో అయ్యో ! అలా చూస్తూ నిలబడతావెంరా నాలుగు తగిలించక ! ఓరి వాజమ్మ ! ణా కాళ్ళ ముందు యింత అఘాయిత్యం జరుగుతుంటే, నేనెలా చూస్తూ వూరుకోనురా! ఏమండీ, మీరైనా రారేమండీ ! అలా చెవిటి మొద్దులా ఆ పడక్కుర్చిలో కూర్చుటారెమండీ అవిడ కేకలతో, ఎడుపులతో ఇల్లు అదిరిపోయింది.
స్వభిమానమూ స్వతంత్ర భావాలూ ఉన్న ఆడపిల్ల జ్యోత్స్న , ఆత్మీయత కోసం అనురాగం కోసం ఆర్రులు సాచింది. శ్యాం ఆమెని ఆకర్షించాడు.
శ్యాం పూర్తిగా తన సొంతమేననీ అతడూ అట్లాగే అనుకోవాలనీ ఆశపడింది. మన జీవితం మన ఒక్కరిదీ కాదు. మన చుటూ వున్నా వాళ్ళతో అది ముడిపడి ఉంటుందన్నాడు శ్యామ్
పెళ్లి ఆమె కలల్ని కూల్చేసింది . ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం పొరపాటా ? అనురాగం అంతా పెళ్లి తో అంతరించి పోతుందా ?  జ్యోత్స్నఆర్గుమెంట్ కరెక్టా! లేక శ్యామ్ వాదన కరెక్టా? భార్యాభర్తలూ యితర కుటుంబ సభ్యులు సహజీవనానికి నవలా రాణి యద్దనపూడి సులోచనారాణి చెప్ప అందమైన భాష్యం - సహజీవనం - ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో సీరియల్ గా వెలువడి పాఠకుల ఆదరణ పొందిన నవల ఇది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good