షహెబాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ఎంత శెహబాష్‌ కవో, ఎంత ఆర్ధ్రత, భావుకత ఉన్న కవో అర్ధం చేసుకోవాలంటే ఆ కవితల లోతుల్లోకి వెళ్ళాలి. ఆయనకీ వ్యవస్ధమీద ఇంత ఆగ్రహం ఎందుకో కూడా ఆ కవితలు చదివితే మరింత బాగా అర్ధమవుతుంది. తన తల్లి, తన ఊరు, తన మట్టి, తన భాష బాల్యంలపై ప్రేమ, మమకారం ఉన్నవాడు. సున్నిత భావనలకు విలువలకు ఆలంభనమైన ఆ భౌతిక అనుబంధాలపట్ల అర్రులుచాచే వాడు ఈ వ్యవస్ధపై కన్నెర్ర చేయకుండా కత్తిదూయకుండా ఉండలేడు. - వివి

సామాజిక చైతన్యం పరివ్యాప్తం చేసేటందుకు 'నెత్తుటిభాష'తో కవిత్వ లోకంలో కదం తొక్కుతున్న కవి షహెబాజ్‌ అహ్మద్‌ ఖాన్‌. పదునైన భావాలను అక్షరాలుగా మలచి దోపిడిమీద తిరుగుబాటు చేస్తున్నాడు. షహెబాజ్‌ టీనేజ్‌ ప్రేమికుడు కాదు. తిరుగుబాటు ప్రేమికుడు. సాఫ్ట్‌వేర్‌ తరంలో సరికొంత్త భావకుడు. - నందిని సిధారెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good