భద్రంకొడుకో సినిమా తీయటం మా స్నేహితులందరి జీవితాల్లో మర్చిపోలేని గొప్ప అనుభవం. మేమందరం కలిసి మా స్నేహానికి అర్థం ఇదని సగర్వంగా చెప్పుకోగలిగిన ఒక మంచి ఉదాహరణ 'భద్రంకొడుకో'. ఈ సినిమా మా స్నేహితులందరిదీ.
సెల్యులాయిడ్ శైశవగీతం 'భద్రంకొడుకో'
పారిజాత పుష్పంలాంటి నవ్వుల్ని విరజిమ్ముకుంటూ గడపాల్సిన బాల్యం ఓదార్చే ఒడిలేక, లాలించే చేతుల్లేక, ప్రేమించే హృదయంలేక తల్లడిల్లిపోతూ అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటూ, తల్లెవరో, చెల్లెవరో, తండ్రెవరో, తోడబుట్టిన వారెవరో తెలీక వాడిపోయి, రాలిపోయే పసిమొగ్గల్లాంటి బాలల కథే ''భద్రంకొడుకో''.
అమాయకమైన కళ్ళతో, బాధ్యతలు లేని బలంతో, స్వచ్ఛమైన స్వేచ్ఛతో ఉష:కాంతి వంటి ఊహతో భవిష్యత్తుకు అభిముఖంగా, సుఖంగా సాగిపోవాల్సిన చిన్నారి లోకం సముద్రం గుండెల్లో తిమింగలంలా సమాజంలో వేళ్ళూనుకున్న దౌష్ట్యాన్ని (దౌర్జన్యాని)కి బలైపోతుంటే, పడుతూ లేస్తూ పరుగులిడే మహాప్రజ దాని పట్టించుకోవడంలేదన్న ఆవేదనను వ్యక్తం చేసే చిత్రమే భద్రంకొడుకో.
చిన్నారి ఆడపిల్లల్ని బలవంతంగా వేశ్యావాటికలకు అమ్మేస్తుంటే చూస్తూ మౌనంగా ఉండిపోవడం ఏ నాగరికతకు ఫలశ్రుతి! ఏ నాగరికతకు ఫలశ్రుతి! ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి అని ప్రశ్నించే చిత్రమే భద్రంకొడుకో.
Rs.40.00
Price in reward points: 40
In Stock
-
+