తెలుగు నేర్పడం' అంటే, ఇతర భాషల వారికి తెలుగు నేర్పడం - అని కాదు. తెలుగు పిల్లలకు తెలుగు నేర్పడం అనే. పిల్లలకే కాదు, పెద్దయ్యాక 'చదువు' మొదలుపెట్టిన వారికి నేర్పడం అని కూడా !
ఈ పుస్తకంలో - తెలుగు 'ఎలా నేర్పాలో' చెప్పింది కొన్ని పేజీల వరకే. మిగిలిందంతా తెలుగు 'ఎలా నేర్పకూడదో' చెప్పడానికే. ఎలా నేర్పాలో చెప్పినా, ఎలా నేర్పకూడదో చెప్పినా సారాంశం ఒకటే. ఒకటో తరగతి వాచకాలతో కూడా వ్యాపారం చేస్తున్న ఇప్పటి రచయితలు కొత్తదనాలేవో తమ వాచకాలలో చూపించి సొమ్ము చేసుకోవటానికి ప్రతి అంశాన్నీ చిన్నాభిన్నం చేస్తున్నారన్నది రంగనాయకమ్మగారి అభియోగం. ఒకటో తరగతిలో చదువు ఎలా నేర్పాలో కూడా ఇప్పటికీ ఖాయం కాలేదనీ ఒక క్రమం అంటూ ఇంకా ఏదీ లేదనీ ఆమె అంటున్నారు. 7,8 తరగతులు చదివే పిల్లలు కూడా వాళ్ల క్లాసు పుస్తకాలు గాక, ఇతర పుస్తకాలు చదవటానికి ఎందుకు తడుముకుంటున్నారంటూ ప్రశ్న వేసుకుని అసలు లోపమంతా తప్పుల తడక తెలుగు వాచకంలో వుందని తేల్చారు రంగనాయకమ్మగారు. తెలుగు నేర్పేక్రమం, ఒకటోతరగతి వాచకం ఎలా ఉండటం పిల్లలకు మంచిది ? కొన్ని ఒకటో తరగతి వాచకాలు, అయోమయ 'వయోజన' వాచకాలు - శీర్షికలతో వున్న నాలుగు ఛాప్టర్లను ఇందులో చూడవచ్చు. తెలుగువాచకాల గురించి అనేక సూచనలు చేస్తున్నారు రచయిత్రి.
Rs.70.00
In Stock
-
+