వెన్నెల అంటేనే హాయి. వెన్నెలంటేనే ఉల్లాసం. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు వెన్నెలంటే అందరకూ ఉత్సాహమే! ఆ హాయి, ఆనందం, ఉల్లాసం కలిగించాలనే ఉద్దేశ్యంతోనే ఈ రచయిత తన రచనకు ''వెన్నెలమ్మ కథలు'' అని పేరు పెట్టి న్యాయం చేకూర్చాడనిపిస్తుంది.

అన్ని కథలు అద్భుతమే! పంచభక్ష్యాలు వడ్డిస్తే, బేధాలెంచగలమా? దేని రుచిదానిదే. పాశ్చాత్య వ్యామోహం జాతిని విధ్వంసక రీతిలో తప్పుదోవ పట్టిస్తుంటే, రచయిత సగటు ప్రేక్షకుడిలా చూస్తూ ఊరుకోకూడదని, నివారణకు తనదైన శైలిలో స్పందించాలని చేసిన రచనే ''క్షమాపణ'' అనిపిస్తుంది. డబ్బు సంపాదన యావలో పడిన నేటి యువతలో లోపిస్తున్న మానవీయ విలువలు మరల జాగృతం కావాలని, ముసలితనంలో తమను పట్టించుకోకుండా వదలి వేసిన కొడుకు గురించి తల్లిదండ్రులబాధ, చివర్లో తనయుడు పరివర్తనా మృదయంతోపడే మానసిక క్షోభ కళ్ళకు కట్టినట్లు 'కనువిప్పు' కథలో చిత్రీకరించాడు రచయిత. అందులోనే, ''వెళ్ళిపోయే వయసులో ఇంకా బంధాలు పట్టుకొని ప్రాకులాడుతావెందుకు'' అని భార్యని ఓదారుస్తున్న భర్త. ''కన్నతల్లి ర్పఏగుబంధం అంత త్వరగా వదలదు'' కాబట్టి పిల్లల్ని ఒక్కసారి చూసి కళ్ళు మూస్తానన్న భార్య సంభాషణ మరియు ప్రతివాళ్ళూ పిల్లలెందుకు కావాలనుకుంటారంటే, వార్థక్యంలో జంట పక్షుల్లో ఒక పక్షి రాలిపోతే, రెండవవారి సంగతి మేం చూసుకుంటాం అనే భరోసాకొరకు అనే డైలాగు ఆ ''కనువిప్పు'' కథలో మనసుకు హత్తుకొని, గుండెల్ని స్పృశించి వదుల్తాయి. నన్ను సృష్టించిన వాడివి నువ్వే కాబట్టి మమ్మల్ని రక్షించే బాధ్యత నీదే అని మానవుడు నా విగ్రహాలను సృష్టించి వారు మీరే కాబట్టి వారి రక్షణ బాధ్యత కూడా మీదే అని 'దేవుడు'' మాట్లాడుకున్న సంభాషణ ''నీ భారం నీదే దేవరా'' అనే రచనలో చతురంగా ఉంది. అపరిమితమైన స్వేచ్ఛకు అలవాటు పడిన యువతీయువకులను ఎలా అదుపులో ఉంచాలా తెలియక తలలు పట్టుకుంటున్న తల్లిదండ్రులకు కాలమే పరిష్కారం చూపుతుందనే వివరణ స్వేచ్ఛ అనే రచనలో చాలా బాగుంది.... - శేషతల్ప రంగారావు

పేజీలు : 228

Write a review

Note: HTML is not translated!
Bad           Good