Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Kolakaluri Enoch Kat..

కొలకలూరి ఇనాక్‌ కథలు మన కళ్ళముందు సజీవంగా కదలాడుతూ వుంటాయి. కొన్ని మనతో మాట్లాడతాయి. ఇంకొన్ని పోట్లాడతాయి. మరికొన్ని కొట్లాడతాయి. ఇంకా కొన్ని ఆప్యాయంగా మన భుజాల్ని నిమురుతాయి. అయితే, ఇవన్నీ అంతిమంగా ఎంతో ప్రేమతో మన కన్నీళ్ళను తుడుస్తాయి. కొలకలూరి ఇనాక్‌ కథలను అర్ధం చేసుకోడానికి ఒకసారి కనీసం మానసికం..

Rs.50.00

Kethu Viswanatha Red..

రాయలసీమ ప్రాతినిధ్య కథకుడుగా పేరొందిన విశ్వనాథరెడ్డి మార్క్సిస్టు కథకుడు. తను పుట్టి పెరిగిన ప్రాంత జీవితాన్ని చిత్రించడం, ప్రాతినిధ్యం వహించడం అనేది విశ్వనాథరెడ్డి రచనల గొప్ప లక్షణం. స్త్రీల పట్ల, దళితుల పట్ల, పేదల పట్ల, శ్రామికుల పట్ల, కార్మికుల పట్ల, పీడితుల పట్ల, ఉద్యమాల పట్ల గౌరవాన్నీ, సంస్కార..

Rs.50.00

Allam Seshagirirao K..

అల్లం శేషగిరిరావు కథలు : వేట కథలకు పెట్టింది పేరు అల్లం శేషగిరిరావు. ఈ కథల్ని వారు సరదాకోసమో, సంతోషం కోసమో రాయలేదు. బాధతోనూ, భయంతోనూ, బాధ్యతతోనూ రాశారు. ప్రపంచమంతటా మంచులా పేరుకుపోయిన అన్యాయాన్ని గుప్పిళ్ళతో తీసి చూపించారు. ఆందోళన చెందారు. ఆందోళన చెందటంతోనూ, గుప్పిళ్ళకొద్ది అన్యాయాన్ని చూపించడంతోనూ..

Rs.50.00

Allam Rajaiah Kathal..

ప్రజా ప్రతిఘటనోద్యమాలతో ఎదిగిన అల్లం రాజయ్య యిప్పటిదాకా ఎనిమిది నవలలూ, వందదాకా కథలూ, కవితలూ, పాటలూ, వ్యాసాలు, నాటకాలు రాశారు. ఆయన కథలనిండా వుత్తర తెలంగాణా గ్రామీణ ప్రాంతాలు, అక్కడి పేద రైతులు, రైతు కూలీలు, వాళ్ళను జలగల్లా పీల్చుకునే భూస్వాములు, కాంట్రాక్టర్లు, వాళ్ళ సేవలో తరించే పోలీసులు, యితర ప్రభు..

Rs.50.00

Kshatagatra

కష్టసుఖాల కథలు జీవితపు లోతుల్ని తాకుతూ వరలక్ష్మి రాసిన కథల పుస్తకం 'క్షతగాత్ర'. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాక ఉద్యోగం పోవడంతో, ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఆ పరిస్ధితుల్లో...అక్షరస్పర్శ తెలీని ఓ పడవవాడు ఆ ఆలోచనని ఎలా మార్చడో 'కలకానిది విలువైనది' కథలో వివరించారు. ఆర..

Rs.95.00

Chemkeedanda Kadhalu

నేను నేనైన నేనుగా ఉండలేని దు:ఖంలోంచీ రాసిన కథలివి. కథలో జీవితముంటుంది. ఆ జీవితం సమాజంలో ఏ వ్యక్తిదైనా కావచ్చు. కాని కథ వెనకల జీవితానుభవంముంటుంది. అది రచయిత వ్యక్తిగత ఆస్తి. వ్యక్తిగత సాధననీ, శోధననీ, చింతల్నీ, వంతల్నీ పబ్లిక్‌పరం చేసేటప్పుడు కథకుడు వ్యక్తిగా మిగలడు. మానవుడిగా సామాన్యీకరణ చెంద..

Rs.75.00

Chandanapu Bomma

వాక్యమంటే రారా చిన్నన్నా...రారోరి చిన్నవాడ..అని ముద్దుగా అన్నమయ్య వేణుగోపాలుణ్ణి పిలిచినంత మార్దవంగా ఉండాలి. నీలం రంగు నిప్పు, పువ్వయి ప్రకాశించాలి. సర్వమూ తానే అయిన వాడిలా వాడిగా లాలించి పాలించాలి. వానవిల్లు మీద నడిచి మేఘాలలో తేలినట్టుండాలి. కాలిగ్రఫీ చిత్రాల్లా కళ్ళకు కట్టాలి. కందర్ప హేతువై ఘనదూమక..

Rs.120.00

Chikagolo Nanamma

ఇది కేవలం ఊహల నుండి పుట్టిన కథలు కావు. ఎందరివో స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు కలిసివున్న సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న ఈ కథల సంపుటిలో ఆధునిక అభివృద్ధి, సైన్స్‌, టెక్నాలజీ జీవితంలో ప్రవేశించిన మేరకు వస్తున్న మార్పులు, సామాజిక పరిణామాలు చిత్రించబడ్డాయి ఈ పుస్తకంలో. ..

Rs.150.00

Payanam

మనిషిమీద గొప్ప కరుణ, అభిమానం రాసాని పాత్రల్లో వున్నాయి. ఇవే కాల ప్రవాహంలో రచయితను మాయం చేయకుండా మళ్ళీ స్మృతికి తెచ్చేస్తుంటాయి. నినాదాల జోరే కథాలక్షణం అనుకునే వారి కోవలోకిరాని కథలు వీరివి. అందువల్ల ఒక ప్రత్యేకతను సంతరించుకుని మెప్పు పొందే వీరి కథల నిండా పరచుకొని వుంటుంది. - మునిపల్లె రాజు రాస..

Rs.60.00

Palleru Mullu Kathal..

రచయిత గురించి ''తెలుగు కథకుల్లో ఎక్కువమంది మధ్యతరగతికి చెందినవారే అయినప్పటికీ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ. అందువల్ల 'పంట పండితే పండగ - పండకపోతే ఎండగ'లా పైరు జీవనం సాగించే రైతులను గురించి వచ్చిన కథలు కూడా తక్కువేనని చెప్పాలి. కరుణకుమార, మా.గోఖలే, జమదగ్ని, కె.సభా లాంటి వారు ..

Rs.170.00

Kuragadhalu

ఆదివారం 'ఆంధ్రజ్యోతి'లో ముప్పై వారాలపాటు ధారావాహికంగా వడ్డించబడినవే ఈ 'కూర గాధలు'. ఎందరో పాఠకులు వీటి రుచిని ఆస్వాదించారు. ఇంకెందరో మరింత సమాచారం వడ్డించమన్నారు. అందరి ఆసక్తి, అభిరుచి మేరకు ఆ గాధలే తమ పూర్తి రూపంతో, రంగు రంగుల ఫోటోల తాలింపు ఘుమఘుమలతో కనువిందు చేసే పుస్తకంగా ముస్తాబై ఇలా మీ ముందుకొ..

Rs.250.00

Adivishnu Kathanikal..

గొప్ప రచయిత చేతుల్లో అది గొప్ప కథానికగా ఎలా మారుతుందో చూడాలనిపించింది. ఆయన పెన్ నుంచి 'సిద్ధార్థ' జాలువారింది. జ్యోతి దీపావళి సంచికలో ప్రచురించిన దానికి బంగారు ఉంగరాన్ని ప్రజెంట్ చేశారు. అప్పుడే అర్థమైంది కథానికకి ఏమి చెబుతున్నామన్న దానికన్నా, ఎలా చెబుతున్నామన్నదని ముఖ్యమని! సీనియర్ రచయితల నుంచి ఇలా..

Rs.200.00

Katha Paravateepuram

ఉత్తరాంధ్రకు ఉత్తర భూములు సారవంతమయినవి గిరులూ తరులూతో సంపన్న మయినవి అచ్చట పుట్టిన చిగురు కొమ్మయిన చేప అన్నట్టు యోధులే కాదు, కలం యోధులు కూడా సామాన్యులు కారు. కాలక్షేపం కోసం కాకుండా జీవితాన్ని చిత్రించి ప్రశ్నించి ఆలోచనలు రేపే ఈ కథలు కేవలం పార్వతీపురపు..

Rs.250.00

Godavari Kathalu

గోదావరి జీవనది. తెలుగువారి జీవితమది. తల్లిగోదారికి కథాకుసుమాలతో పూజచేసిన సీతారాముడు సామాన్య కథకుడుకాదు వాడు గోదాట్లోచేప అంటే అనగా అనగా ఓ చేపగాడు కాడు ఏటివాలు వెంట కొట్టుకుపోయే సదాసీదా చేపగాడు కాడు; ఏటికెదురీదే చేవగల పొగరు మోతు 'పొలస' చేప. గోదా..

Rs.150.00

Vamsiki Nachina Kath..

కథల గురించి... ఈ కథల సంకలనం తేవడానికి ముగ్గురు ముఖ్య కారకులున్నారు. వారు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ వాసిరెడ్డి నవీన్‌, పొన్నపల్లి సీత. వారికి కృతజ్ఞతలు. నిజానికి నాకంత తొందరగా ఏవీ నచ్చవు. నేను రాశానని బయటపెట్టిన మొదటి కథకు ముందు పదహారు కథలు రాసి చించే..

Rs.300.00

Jekamuka Sanchi

ఈ పుస్తకంలో చిల్ల మల్లేశం రచించిన తెలంగాణ పల్లెకధలు ఉన్నాయి...

Rs.40.00

Taarumaaru

ఏ కథానిక అయినా జీవిత చిత్రణే. ఊహాత్మక జీవిత చిత్రణ కాక రచయిత అనుభవ పరిధిలోకి వచ్చే జీవిత చిత్రణలో విశ్వసనీయత ఎక్కువ. స్థలకాలాలు, వాటి మూలంగా అమిరే వాతావరణంలో పాఠకుడు సులభంగా మమేకమవుతాడు. ... దేవులపల్లి కృష్ణమూర్తి గారివి తీగలు సాగి పందిరిని అల్లుకుంటున్న కథానికలు. దేశీయమైన వాతావరణంలో సహజమైన సన్నివేశ..

Rs.100.00

Kathala Guudu

అత్యంత సాధారణ భాష, భావజాలంతో ఒక క్రమగతిలో సాగే ఈ పదహారు కథల 'కథలగూడు'లో రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి నింపాదిగా, స్థిమితంగా ఉండుండీ జీవితం మారుమూలల్లో దాగిన మానవీయ అంశాలపై అసాధారణ శక్తిగల సెర్చిలైటు వేసి, మస్తిష్కంలో వెలుగులు వెలిగిస్తాడు. ఆయా పాత్రల నిరాడంబరత్వాన్ని సాధారణమైన భాషలో పలికిస్తూ మెరుపుల..

Rs.60.00

Enuganta Tandri Kann..

సూర్యగ్రహణాన్ని వర్ణించనీ, చావడి దగ్గర చేరిన గ్రామస్తులను గురించి చెప్పనీ, బర్రెమీద సవారీ చేసే పల్లెటూరి పిల్లను గురించి చెప్పనీ, దళితులు కొట్టే డప్పు చప్పుడులోని వివిధ దరువులు పరిచయం చేయనీ... గోగు శ్యామల కథనంలో వుండే మంత్ర శక్తి ఒకే స్థాయిలో వుంటుంది. దానిక..

Rs.80.00

Munde Meluko

ముందే మేలుకో (వైద్య విజ్ఞాన కథలు) - వల్లూరు శివప్రసాద్‌ తన చుట్టూ జీవితాన్ని కదిలించే సంఘటనల్ని నిశితంగా పరిశీలించలేనివాడు కథకుడుగా రాణించలేడు. కదిలిపోయి, కలవరాన్నంతా తక్షణమే కాగితాల మీద కక్కేసినా కళాత్మక విలువలు లుప్తమవుతాయి. శిల్పానికీ శైలికీ లోపం చేయకుండా ఆ 'కదలిక'ను కాయితం మీదకి బట్వాడా చేయాలి...

Rs.75.00