విభిన్న ఇతివృత్తాలు ఎంచుకోవడంలోనూ, కధానుగుణంగా అవసరమైన వాతావరణాన్ని సృష్టించడంలోనూ నరసింహమూర్తి గారిది అందెవేసిన చేయి. వీరి కధల్లో ముఖ్యంగా నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలు, పాశ్చాత్య నాగరికతపై మోజులో మన సంప్రదాయాలను విస్మరిస్తున్న నేటి తరం వేలం వెర్రి, నక్సలిజం మూలాలు, చిరుద్యోగుల జీవనాన్ని గురించి తపన, గిరిజనులు, వ్యవసాయ కూలీల వెతలు, పోలీసు, ప్రభుత్వ శాఖలు రాజకీయం చేతి పావులుగా మారడం వగైరా విభిన్న ఇతివృత్తాలు కనిపిస్తాయి. పల్లెటూరి అందాలు, అగ్రహారపు మిసమిసలు, మారుమూల రైల్వే లైన్ల దుస్థితి, ఏజెన్సీ ప్రాంత ప్రజల జీవనవిధానం, కడగండ్లు సమయోచితంగా ఈ కథల్లో దర్శనమిస్తాయి.
- రాచకూటి రమేష్

Write a review

Note: HTML is not translated!
Bad           Good