మొదట్లో కథలు రాస్తున్నప్పుడు ఆ టీనేజ్‌కి సంబంధించిన చూపుని, వొక టీనేజర్‌ అంతరంగాన్ని, వొక స్త్రీ దృష్టికోణాన్ని ప్రతిబింబించే కథలు

'మనసుకో దాహం'లో, అప్పుడప్పుడే కుటుంబ వాతావరణం నుంచి బయటకి అడుగు పెట్టాలంటే యెలా పెట్టాలాని ఆలోచించుకొంటూ నిలబడటానికి

నగరముందని నగరానికి వచ్చే అమ్మాయిలూ, వున్న నగరం చాలా వేగంగా మారిపోతుండటం, సంక్లిష్టంగా వుండటం, యిలాంటిచోట యెలా నిలబడాలి

అనుకుంటున్నవాళ్ళ కథలు 'ముక్త'లో రాశాను. నగరంలో వస్తున్న మార్పులకి కారణం ప్రపంచంలో వస్తున్న అనేక మార్పులు అనే విషయం

అర్థమవుతున్నప్పుడు 'సాలభంజిక' కథలు చ్పెటం, అన్నీ వుండి కూడా యెదుర్కొంటున్న యెమోషనల్‌ వయొలెన్స్‌ని 'మంచుపూల వాన'లో,

రవ్వంత ప్రేమ కూడా బయటి ప్రపంచంలో యెలా బాధాకరమవుతుందో 'వాన చెప్పిన రహస్యం'లో చెపితే, వీటన్నిటి మధ్య నిలబడి వెతుక్కుంటున్న

చోటులో దాదాపు అన్నివిధాలా కోల్పోతోన్న అమాయకత్వం 'ది లాస్‌ ఆఫ్‌ యిన్నోసెన్స్‌'లో ప్రతిబింబించాయి.

Pages : 206

Write a review

Note: HTML is not translated!
Bad           Good