ఈ కథలన్నీ 1965, 75 మధ్యకాలంలో వెలువడ్డవే! ఆ రోజుల్లో వీటిని మాస, వార పత్రికల్లో చదువరులు వేడివేడిగా చదువుకొని ఆనందించినవే.

స్త్రీవాదం రాకపూర్వం స్త్రీల అస్తిత్వం, చైతన్యం ప్రతిపాదించిన, ప్రతిష్ఠించిన సాహిత్యంలో ఈ కథానికలు ప్రముఖ స్థానంలో నిలిచాయి.

శరత్‌ అనువాద నవలలు, చలం నవలా, కథా సాహిత్యం కలిగించిన చైతన్యంలో, తెలుగు సమాజం, ముఖ్యంగా స్త్రీలు, ఉత్తేజితులై రచయిత్రులుగా, పాఠకులుగా ప్రభవించిన కాలానికి చెందినవీ కథలు.

ఈ సంకలనంలోని కథానికలన్నీ స్థూలంగా స్త్రీ పురుష సంబంధాలలోని మానవీయత చుట్టూ అల్లుకొన్నాయి. ఇవి చాలావరకు స్త్రీ దృష్టి కోణం నుంచి వచ్చాయి, వెలుగు చూశాయి.

స్త్రీ పురుషులు సంప్రదాయ చట్రం నుంచి బైటపడి, మానవీయ భావజాలం పుణికి పుచ్చుకొని, ఆధునికీకరణం చెందే మార్గంలో నిలవటాన్ని వ్యక్తీకరించే కథానికలివి.

- ఆచార్య కొలకలూరి ఇనాక్‌

Pages : 460

Write a review

Note: HTML is not translated!
Bad           Good