ప్రపంచీకరణ బ్రహ్మరాక్షసి ఉక్కు పాదాల కింద ఛిద్రమైపోతున్న కులవృత్తి పరుల జీవితాలను ఆదుకోవాలన్న తపన వ్యక్తమవుతుంది.  మారుమూల పల్లెల్లో మూఢాచారాల ముసుగుతో అగ్రవర్ణ భూస్వాములు తమ 'బులపాటం' తీర్చుకోవడానికి కాపాడుతున్న 'బసివిని' వంటి హీనమయిన పద్ధతుల నుండి బాధితులు బయటపడాలన్న చైతన్య ప్రబోధం ఈ కథల్లో వినిపిస్తుంది. మనుషుల్లో నుంచీ పారిపోతున్న మనిషితనాన్ని రక్షించుకోవలసిన అవసరాన్ని ఈ కథలు సూచిస్తాయి. మానవీయతా పరిమళాలను వెదజల్లుతాయి. అందుకే మనుషుల మనసుల్లో మానవత్వం మసిబారిపోయి, మానవ విలువలు మాయమైపోతున్న ఈ తరుణంలో, తిరిగి మానవత్వపు మార్గంలో నడవండని తన కలాన్నే 'ముల్లుగర్ర'గా మార్చుకుని జలిపిస్తూ, కథల కేకలతో మనల్ని అదిలిస్తున్నాడు రాసాని.

- డా|| శాంతి నారాయణ

Pages : 252

Write a review

Note: HTML is not translated!
Bad           Good