....బహుశా ఆ నేపథ్యం అతన్ని ఉన్న కాడ ఉండనియ్య లేదు. కాళ్లు కడుపులో పెట్టుకొని పడుకోనియ్యలేదు. ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు రెండు కాళ్లకు కట్టుకొని బజార్ల కొచ్చి నిలుచున్నాడు. ఇగ జూస్కో! ప్రశ్నలే ప్రశ్నలు... తిరుగుడే తిరుగుడు... ప్రశ్నల వెంటపోతే, పోరాటాలు! యుద్ధ భీభత్సం! సకల సంపదలు, తమ సమస్త శక్తులు వెచ్చించి, రంగరించి సృష్టించే మానవాళికి కావాల్సిన సకలం దోచుకొని జబర్దస్తీగా, రాజ్యం చేసే దోపిడిదారులుగా మోహరించి ఉన్నదని అర్థం చేసుకునే క్రమంలో అవి మార్చడానికి జరిగే పోరాటాలల్లో పరిచయమైన మనుషులు, ప్రజా సంఘాలు.... అదిగో అలాంటి దుక్కింలోంచి మొలిచిన మొక్కలు, ఇదిగో ఈ కథలు.... - అల్లం రాజయ్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good