మారుతున్న సమాజంలో కొత్తగా ఉద్భవిస్తున్న సరికొత్త పాత్రలని పట్టుకొని వారు అలా రూపొందుతున్న తీరు తెన్నులతోపాటు. దాని వెనక ఉన్న కారణాల వైపు దృష్టి ప్రసరింపచేసే విధంగా కొందరు మాత్రమే కధారచన చేయగలుగుతున్నారు. నిజానికి కారెక్టరును పట్టుకొని కథలు రాసేవారి సంఖ్య తక్కువగా ఉందని అనిపిస్తోంది. ఒక సంఘటననో, ఒక అంశాన్నో తీసుకొని రాస్తున్న వారి సంఖ్యే అధికంగా ఉంటోంది.

జంధ్యాల మాలతిగారు కొత్తతరం పాత్రలను, సమాజంలో కొత్తగా రూపొందుతున్న పాత్రలను పట్టుకొని కథలు మలుస్తున్నారు. 'రాంగ్ కాలిక్యులేషన్', 'అంతు దొరకదు' లాంటి కథల్లో కొత్తగా రూపొందుతున్న ఈ తరపు మనుషుల, వారినైజాలు మనముందుకు వస్తాయి. అందుకే మాలతిగారి వెన్నుతట్టి శుభాకాంక్షలు అందజేస్తున్నాను.
- చాగంటి తులసి

Write a review

Note: HTML is not translated!
Bad           Good