నేనెందుకు రాస్తున్నాను?

కొన్ని కథల్ని నేనే ఎందుకు రాస్తున్నాను?

నేను రాస్తున్నానా లేక పరిస్థితులు నాతో రాయిస్తున్నాయా? ఈ అన్వేషణలోనే ఊరు నా కథలకు ఊటబాయి అయింది. కనిపించే జీవితాలే కథావస్తువులయ్యాయి. కళ్ల ముందు కదలాడే మనుషులే పాత్రధారులయ్యారు. మొరందేలిన వాకిళ్లు, మూతపడ్డ ఇండ్లు, దగాపడిన జీవితాలు అనివార్యంగా నా కథల్లోకి వచ్చాయి. పల్లె మధ్యలో నిలబడి ప్రపంచాన్ని దర్శించాను. చెప్పింది చాలా తక్కువ. చెప్పాల్సింది ఎక్కువ. నేను మా ఊరి మట్టిని కెలుకుతూ మైలపడిన జీవితాలను గుండెకద్దుకుంటున్నాను. మాయమైన చెరువు దిక్కు, ఎండిన వాగు దిక్కు, కరిగిపోతున్న గుట్టల దిక్కు ఇప్పటికీ దిగులుగా చూస్తున్నాను. అవే కథలుగా సమాజానికి నాకు మౌనవారధిని కడుతున్నాయి. - పెద్దింటి అశోక్‌కుమార్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good