''గ్రీకులు వేల సంవత్సరముల క్రిందట అత్యంత నాగరికత చెందినవారుగా నుండిరి. వీరిని రోమనులు జయించిరి. అయినను గ్రీకుల నాగరికతచే రోమనులు ఎక్కువ లాభముపోందిరి. రోమనులు గ్రీకు దేవతలకు మారు పేరులు పెట్టిరి. రోమనులు గొప్ప సార్వభౌమాధికారము కలిగియుండిన వారగుటచే రోమనుల నామములే మిక్కిలి ప్రసిద్ధికి వచ్చెను. గ్రీకు నామములు విస్మృత పధమున పడిపోయెను. ఈ రచనలయందు గ్రీకు-రోమన్‌ నామములు పర్యాయపదములుగా వాడబడినవి.

యురేనసు
ప్రారంభమున విశ్వమంతయు అస్తవ్యస్తముగానుండెను. అప్పుడు ''ప్రేమ'' ప్రబలి వివిధ సృష్టికి దోహదము కలిగించెను. ఆ ప్రాచీన మానవులకు పైన ఆకాశము కనుపించు చుండెను. క్రింద భూమి కనిపించు చుండెను. గ్రీకు భాషలో ఆకాశమునకు 'యురేనసు' అని పేరు, భూమికి 'గియా' అని పేరు. ఆకాశము, భూమి కలియుచున్నట్లు వారికి దృష్టిగోచర మగుచుండెను. భూమిపై పర్వతములు, సాగరములు, వృక్షములు వివిధములయిన జీవరాసులు జనించు చుండెను. యురేనసు పురుషుడు, గియా స్త్రీ అని వారు భావించిరి. ఈ విధముగా ఆకాశము దేవతామూర్తిమంతమయి యురేనసు నామమును వహించెను. భూదేవతారూపమయిన గీయాను యురేనసు పెండ్లి యాడెను. వీరే గ్రీకు పురాణములలో కనబడు ఆది దేవతలు. ఆది దంపతులు. యురేనసు పితృస్వరూపుడు, గియా మాతృస్వరూపిణి....

Write a review

Note: HTML is not translated!
Bad           Good