దీనికి బ్రిటిష్‌ క్రైమ్‌ కథలు అనే పేరు పెట్టడానికి కారణం, ఇందులోని కథలన్నీ బ్రిటన్‌లో జరగడం లేదా బ్రిటిష్‌ రచయిత రాసింది అవడం లేదా బ్రిటిష్‌ పాత్ర ఉండటం. ఆ ప్రాతిపదిక ఆధారంగా కథలని ఈ సంపుటిలో చేర్చాను. ప్రఖ్యాత అపరాధ పరిశోధకుడు షెర్లాక్‌ హొమ్స్‌, గూఢచారి 007 జేమ్స్‌ బాండ్‌, ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌, స్కాట్‌లేండ్‌ యార్డ్‌ల స్వదేశమైన బ్రిటన్‌కి చెందిన ఈ కథా సంపుటిలోని పేజీల్లో చాలా మంది మరణిస్తారు.

గొంతు నులమబడి, తల నరకబడి, కారు ప్రమాదంలో, సుత్తితో, విషంతో, రివాల్వర్‌ గుండుతో, కత్తితో పొడిచి, జెల్లీ ఫిష్‌తో, రాబందులతో... అన్నిటికీ మించి కలం పోటుతో పాత్రలని చంపవచ్చని బ్రిటిష్‌ క్రైమ్‌ రచయితలు ఈ కథల ద్వారా ఋజువు చేస్తున్నారు.

బ్రిటన్‌లోని లండన్‌లో, సౌతంప్టన్‌లో, రగ్బీలో, లివర్‌పూల్‌లో, దోవర్లో, కార్లిస్లెలో, న్యూ కేజిల్‌లో, బర్మింగ్‌హేమ్‌లో ఇలా అనేక చోట్ల ఈ కథలు జరుగుతాయి. సేల్స్‌మెన్‌, డాక్టర్లు, లాయర్లు, హోటల్‌ వెయిట్రెసెస్‌, విద్యార్థులు, కార్‌ మెకానిక్స్‌, బార్‌ టెండర్స్‌... ఇలా అనేక మందిని మీరు ఈ కథల్లో కలుసుకోవచ్చు. లవర్‌లా నేరస్థుడు కూడా దాక్కో లేడు అన్నది ప్రతీ కథా బోధిస్తుంది. ఉత్కంఠ, ఉత్సాహం, వినోదం, కొస మెరుపుల కోసం మీరు వీటిని ఆస్వాదించచ్చు.

మంచి క్రైం కథలో ఎన్నో దినుసులు ఉంటాయి. కాని ఆ దినుసులు ఉన్న కథలన్నీ మంచి కథలు కావు. మంచి క్రైం కథలో చదివించే గుణం, సస్పెన్స్‌తో సాగడం, కొస మెరుపుతో ముగియడం అనే దినుసులు ఉంటాయి. ఈ సంకలనంలోని అన్ని కథల్లో ఈ మూడు దినుసులు ఉండటంతో చక్కటి క్రైం కథలు చదివిన తృప్తిని అవి మీకు తప్పక ఇస్తాయి.

పేజీలు : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good