జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోలేని వాటిని అతీంద్రియం అంటారు. కాని తెలుగు పాఠకుల్లో అతీంద్రియం అంటే కేవలం దెయ్యం, చేతబడులు అనే ముద్ర బాగా పడింది.
    ఈ పుస్తకంలోని ఇంగ్లీష్‌ కథా రచయితల ముడి సరుకు అతీంద్రియాలే. అంటే అంతు చిక్కనివే. ఊడు డాల్‌, మంత్రగత్తె, మంచి భూతం, చెడ్డ దెయ్యం, గ్రహాంతరాలు, దేవ దూతలు, స్వర్గం-నరకం, మిస్టిక్‌ పవర్స్‌ మొదలైన నేపధ్యంలో రాసిన ఈ తరహా కథలు తెలుగులో ఎన్నడూ రానివి. ఇవి భయ పెట్టవు. ఒళ్ళు గగుర్పొడిచేలా చేయవు. కాని మొత్తం చదివాక కొసమెరుపుతో ముగిసి 'భలే' అనిపించేలా చేస్తాయి. ఆలోచింపచేస్తాయి కూడా.
    రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రత్యేకంగా ఎంపిక చేసి, అనువదించిన ఈ కథా సంపుటిలోని మరో ప్రపంచపు అతీంద్రియ కథలన్నీ మీకు నచ్చేవే.
Pages: 143

Write a review

Note: HTML is not translated!
Bad           Good